భారత హాకీ దిగ్గజం కన్నుమూత

భారత హాకీ దిగ్గజం కన్నుమూత

Moscow Olympic Gold Medallist Hockey Player Ravinder Pal Singh Succumbs To Covid 19

Updated On : May 8, 2021 / 2:06 PM IST

భారత హాకీ జట్టు మాజీ సభ్యుడు, మాస్కో ఒలింపిక్స్ 1980 బంగారు పతక విజేత రవీందర్ పాల్ సింగ్ లక్నోలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. సింగ్‌ను ఏప్రిల్ 24న వివేకానంద ఆసుపత్రిలో చేర్చగా.. కుటుంబ వర్గాల సమాచారం ప్రకారం, కరోనా నుంచి కోలుకున్న తర్వాత.. నెగెటివ్ పరీక్షలు వచ్చినట్లుగా చెప్పారు.

కరోనా వార్డ్ నుండి బయటపడిన తర్వాత ఆకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 1984 లాస్ ఏంజిల్స్‌లో ఒలింపిక్స్ ఆడిన సింగ్ వివాహం చేసుకోలేదు. మేనకోడలు ప్రగ్యా యాదవ్ రవీందర్ సింగ్ బాగోగులు చూసుకున్నారు. అతను 1979 జూనియర్ ప్రపంచ కప్ కూడా ఆడాడు. హాకీని విడిచిపెట్టిన తర్వాత స్టేట్ బ్యాంక్ నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొందాడు.

సీతాపూర్‌లో జన్మించిన రరవీందర్ పాల్ సింగ్ 1979 నుండి 1984 వరకు అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. రెండు ఒలింపిక్స్‌తో పాటు, అతను 1980 మరియు 1983 లో ఛాంపియన్స్ ట్రోఫీ, 1982 ప్రపంచ కప్ మరియు 1982 ఆసియా కప్‌లను కూడా ఆడాడు.

1983 సిల్వర్‌ జూబ్లీ కప్‌ (హాంకాంగ్‌), 1982 ప్రపంచకప్‌ (ముంబయి), 1982 ఆసియా కప్‌ (కరాచీ) పోటీల్లో ఆడారు. 1979లో జూనియర్‌ ప్రపంచకప్‌లోనూ ప్రాతినిధ్యం వహించారు. ఆయన మరణం పట్ల హాకీ ఇండియా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు సంతాపం ప్రకటించారు.