MS Dhoni : దొంగచాటుగా ధోని వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్.. ఫ్యాన్స్ ఫైర్.. ఇలా చేయడం ఏం బాలేదు
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ని అభిమానిస్తారంటే అతి శయోక్తి కాదేమో.
MS Dhoni Sleeping On Airplane : టీమ్ఇండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని(Mahendra Singh Dhoni )కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రత్యర్థి ఆటగాళ్లు సైతం ధోని ని అభిమానిస్తారంటే అతి శయోక్తి కాదేమో. ఇక మహేంద్రుడు ఎక్కడ కనిపించినా చాలు ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు అభిమానులు ప్రయత్నిస్తుంటారు. అయితే.. కొందరు ఈ విషయంలో హద్దులు దాటి ప్రవర్తిస్తుంటారు.
కాగా.. విమానంలో ధోని నిద్రపోతున్న (MS Dhoni Sleeping) ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఓ ఎయిర్ హోస్టెస్ (Air hostess) తీసింది. కాగా.. వీడియో తీసిన ఎయిర్ హోస్టెస్‌పై అభిమానులు మండిపడుతున్నారు. ఇందుకు కారణం ఎంటంటే..?
మహేంద్ర సింగ్ ధోని ఇటీవల తన భార్య సాక్షి సింగ్‌తో కలిసి ఓ విమానంలో ప్రయాణించాడు. కాగా.. ప్రయాణంలో ధోని నిద్ర పోతుండగా, సాక్షి ఏదో చదువుతూ కూర్చుకుంది. అయితే.. వీరికి తెలియకుండా ఓ ఎయిర్ హోస్టెస్ వీడియో తీసింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోని పక్కనే ఉన్నాడు చూడండి అంటూ ఎయిర్ హోస్ట్స్ నవ్వులు చిందిస్తోండగా ధోని ప్రశాంతంగా నిద్రపోతుండగా పక్కనే సాక్షి కూడా కనిపించింది.
Afghanistan Batsman: ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదిన ఆఫ్ఘనిస్థాన్ బ్యాట్స్‌మెన్.. వీడియో వైరల్
దీనిపై నెటీజన్లు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ధోని ప్రశాంతంగా నిద్రపోతున్న వీడియో చూసి సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఎయిర్ హోస్టెస్ ప్రవర్తన పై మండిపడుతున్నారు. ఇది ధోని ప్రైవసీకి భంగం కలిగించడమేనని అంటున్నారు. ఎయిర్ హోస్టెస్‌లు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరుతున్నారు. ఇలా చేయడం ఏమీ బాలేదని కామెంట్లు పెడుతున్నారు.
ఐపీఎల్ 2023లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. ఈ సీజన్ ముగిసిన వెంటనే మహేంద్రుడు మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ప్రస్తుతం రాంచీలోని తన ఫామ్ హౌస్‌లో కోలుకుంటున్నాడు. ధోని బాగానే ఉన్నాడని, ఫిట్నెస్ సాధించే పనిలో ఉన్నట్లు ఇటీవల ఆయన సతీమణి సాక్షి తెలియజేసింది. కాగా.. ఐపీఎల్ 2023 సీజన్ తనకు ఆఖరిది కాదని 2024 సీజన్ ఆడాలని ఉన్నట్లు గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్ మ్యాచ్ అనంతరం ధోని తన మనసులో మాటను బయటపెట్టాడు. అయితే.. ఇది రానున్న నెలల్లో తన శరీరం సహకరించే దానిపై ఆధారపడి ఉంటుందని చెప్పాడు.
Cutest video on the Internet today ??#WhistlePodu #MSDhoni
?: karishma__6e pic.twitter.com/fOyRh1G079— WhistlePodu Army ® – CSK Fan Club (@CSKFansOfficial) July 29, 2023