వాంఖడేలో ధోనీ కోసం వెయిట్ చేసిన స్పెషల్ ఫ్యాన్

వాంఖడేలో ధోనీ కోసం వెయిట్ చేసిన స్పెషల్ ఫ్యాన్

Updated On : April 4, 2019 / 9:36 AM IST

ధోనీ అంటే ఓ ప్రభంజనం. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న మహేంద్ర సింగ్ ధోనీకి విపరీతమైన క్రేజ్. వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను సంపాదించుకున్న మహీ.. ముంబైలోని వాంఖడే వేదికగా ఓ ప్రత్యేక అభిమానిని కలుసుకున్నాడు. బుధవారం ముంబైతో మ్యాచ్ జరుగుతున్నంతసేపు వేచి ఉండి ఆ తర్వాత కూడా ధోనీ వచ్చేంతవరకూ ఎదురుచూసిన ఆ పెద్దావిడ కల ఫలించింది.

ఏప్రిల్ 3వ తేదీ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా చెన్నై వర్సెస్ ముంబై మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో ఓ వృద్ధురాలు ‘ఐ యామ్ హియర్ ఓన్లీ ఫర్ ధోనీ'(నేను ధోనీ కోసమే ఇక్కడున్నా) అనే ప్లకార్డుతో స్టేడియంలోనే కనిపించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండడంతో సిబ్బంది గమనించి విషయాన్ని ధోనీకి తెలియజేశారు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోనీ వచ్చే వరకూ తన మనమరాలితో కలిసి అలాగే ఎదురుచూసింది. 

ధోనీ వచ్చి కాసేపటి వరకూ వారితో ముచ్చటించి ఓ సెల్ఫీ కూడా దిగాడు. ఆ తర్వాత జెర్సీపై సంతకం చేసి బహుమానంగా ఇచ్చాడు. వాంఖడే వేదికగా జరిగిన ముంబైతో మ్యాచ్ లో చెన్నై సీజన్ లోనే తొలి ఐపీఎల్ పరాజయాన్ని మూటగట్టుకుంది. మరో మ్యాచ్ ను ఏప్రిల్ 6న చిదంబరం స్వామి స్టేడియం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ వేదికగా ఆడనుంది.