MS Dhoni: ఇంగ్లండ్‌లో ధోనీ వాకింగ్.. ఎగబడ్డ ఫ్యాన్స్.. వీడియో వైరల్
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటబడుతున్నారు. తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఇంగ్లండ్‌లో వాకింగ్ చేస్తుండగా అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారి నుంచి ధోనీ తప్పించుకుని వెళ్ళాల్సి వచ్చింది.
MS Dhoni: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అతడు ఎక్కడికి వెళ్ళినా ఫ్యాన్స్ వెంటబడుతున్నారు. తాజాగా, ధోనీకి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ధోనీ ఇంగ్లండ్‌లో వాకింగ్ చేస్తుండగా అతడితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారి నుంచి ధోనీ తప్పించుకుని వెళ్ళాల్సి వచ్చింది. ‘ధోనీ.. ధోనీ’ అంటూ నినాదాలు చేస్తూ అభిమానులు హోరెత్తించారు. ధోనీ రియల్ సూపర్ స్టార్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
IndVsEng 3rd ODI : పంత్ వీరోచిత సెంచరీ.. మూడో వన్డేలో ఇంగ్లండ్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్ కైవసం
ధోనీకి ఇంగ్లండ్‌లోనూ ఇంతగా ఫాలోయింగ్ ఉండడం సాధారణమేనని అంటున్నారు. అభిమానులు ఎగబడడంతో ధోనీ భద్రతా సిబ్బంది సాయంతో కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. తొలి వన్డే మ్యాచును మైదానంలో సురేశ్ రైనాతో కలిసి ధోనీ చూశాడు. మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1 తేడాతో గెలుపొందింది.
M S Dhoni in London. Crazy Fans Are Chanting Dhoni Dhoni Behind Him and want to take selfie with him. Real Superstar. #msdhoni #dhoni #msdhoni #crazyfans pic.twitter.com/2ZMXMPZuWj
— chandrakant shinde (@shindeckant) July 16, 2022