ODI World Cup : 2011 ప్రపంచకప్‌కు రోహిత్‌ను ఎంపిక చేద్దామనుకుంటే.. ధోని వద్దన్నాడు
టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్(2007టీ20, 2011 వన్డే) లు అందించాడు మాజీ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. 2011 ప్రపంచకప్‌లో యువ ఆటగాడిగా ఉన్న కోహ్లికి అవకాశం వచ్చింది గానీ, అతడి కంటే ముందే అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మకు మాత్రం ఛాన్స్ దక్కలేదు.

MS Dhoni against Rohit Sharma
ODI World Cup 2011 : టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్(2007టీ20, 2011 వన్డే) లు అందించాడు మాజీ దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni). కపిల్ దేవ్ సారథ్యంలో 1983లో వన్డే ప్రపంచకప్‌ను తొలిసారి ముద్దాడిన టీమ్ఇండియా రెండో సారి కప్పును సొంతం చేసుకునేందుకు దాదాపు 28 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. 2011లో స్వదేశంలో జరిగిన ఈ మెగా టోర్నీలో భారత జట్టును విజేతగా నిలపడంలో సచిన్, యువరాజ్, గంభీర్‌లతో పాటు ధోనీ కీలక పాత్ర పోషించారు.
కాగా.. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో ఆ సమయంలో యువ ఆటగాడిగా ఉన్న కోహ్లికి అవకాశం వచ్చింది గానీ, అతడి కంటే ముందే అరంగ్రేటం చేసిన రోహిత్ శర్మ(Rohit Sharma )కు మాత్రం ఛాన్స్ దక్కలేదు. ఈ విషయం తనను చాలా నిరాశకు గురి చేసిందని రోహిత్ గతంలో ఓ సందర్భంలో చెప్పాడు. తాజాగా దీనిపై మాజీ జాతీయ సెలెక్టర్ రాజా వెంకట్ (Raja Venkat) స్పందించారు. ధోనీ వల్లనే రోహిత్‌కు ఆ ప్రపంచకప్‌లో చోటు దక్కలేదని ఓ క్రీడా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజా చెప్పాడు.
Asia Cup 2023 : వాళ్లు అదృష్టవంతులు.. అశ్విన్ గురించి చర్చ వద్దు.. నచ్చకపోతే మ్యాచులు చూడకండి
అప్పుడు టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉంది. మరో సెలక్టర్ యశ్‌పాల్ శర్మతో కలిసి తాను సౌతాఫ్రికాలో ఉండగా మిగిలిన ముగ్గురు సెలక్టర్లు చెన్నైలో ఉన్నారని రాజా చెప్పారు. ప్రపంచకప్ జట్టులో 15 మందికి చోటు ఇవ్వాలి ఉంది. 14 స్థానాల వరకు అంతా సజావుగానే సాగింది. అయితే.. 15వ ఆటగాడిగా మేము(సెలక్టర్లు) రోహిత్ శర్మ పేరు ను సూచించాము. ఇందుకు కోచ్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఓకే చెప్పాడు. అయితే.. కెప్టెన్‌గా ఉన్న ధోనీ మాత్రం నో చెప్పాడని అన్నారు.
15వ ఆటగాడిగా పీయూష్ చావ్లా కావాలని ధోనీ పట్టుబట్టాడు. వెంటనే కోచ్ కిర్‌స్టన్ సైతం మాట మార్చేశాడు. ధోనీ కి మద్దతు పలికాడు. అలా రోహిత్ శర్మ ఆ ప్రపంచకప్‌కు దూరం అయ్యాడు అని రాజా చెప్పారు. ఇక 2011 ప్రపంచకప్‌లో పీయూష్ చావ్లా మూడు మ్యాచులు ఆడి నాలుగు వికెట్లు తీశాడు.
Asia Cup 2023 : ఆసియా కప్ మ్యాచులను ఫ్రీగా చూడొచ్చు.. ఎక్కడంటే..?
ఇదిలా ఉంటే.. కెరీర్ ఆరంభంలో రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్‌లో ఆడిన సంగతి తెలిసిందే. అయితే.. అతడిని ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది మాత్రం ధోని అన్న సంగతి తెలిసిందే. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఎలాంటి విధ్వంసాలు సృష్టించాడో అందరికి తెలిసిందే. వన్డేల్లో మూడు సార్లు డబుల్ సెంచరీ బాదిన ఏకైక ఆటగాడు హిట్‌మ్యాన్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ప్రస్తుతం రోహిత్ సారథ్యంలో స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు బరిలోకి దిగుతోంది. ఈ సారి ఎలాగైన సరే భారత్ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో భారత్ తన మొదటి మ్యాచ్‌ను అక్టోబరు 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా తలపడనుంది.
Virat Kohli : కోహ్లీ క్రికెటర్ కాకపోయుంటే ఏ క్రీడలో రాణించేవాడు..? భువనేశ్వర్ కుమార్ ఏం చెప్పాడంటే..