ధోనీకి గాయం : ఉప్పల్ వన్డేకు డౌట్

ఉప్పల్ వేదికగా జరగనున్న తొలి వన్డేకు ముందు టీమిండియాకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం జరగనున్న మొదటి వన్డే క్రమంలో ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న టీమిండియా నెట్స్‌లో తీవ్రంగా ప్రాక్టీసు చేసింది. ఇప్పటికే టీ20 సిరీస్ కోల్పోయిన భారత్.. వన్డే సిరీస్ ను ఎలాగైనా చేజిక్కుంచుకోవాలనే తాపత్రయంలో కనిపించింది. ఈ మేర తన ఫామ్‌ను కొనసాగించాలని చేసిన ప్రయత్నంలో ధోనీ శుక్రవారం అందరికంటే ఎక్కువ సమయం ప్రాక్టీసులో పాల్గొన్నాడట.
Read Also : దేశం విడిచి వెళ్లిపో.. పాక్ మహిళను ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
ఈ క్రమంలో సపోర్టింగ్ స్టాఫ్‌తో కలిసి చేస్తున్న ప్రాక్టీస్‌లో బంతి కుడి మోచేతికి బలంగా తాకి గాయమైందట. గాయం తీవ్రత ఇప్పటికీ సరిగ్గా నిర్దారణ చేయకపోవడంతో మొదటి వన్డేకు ఆడటం అనుమానమేనన్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ చేయకపోవడమే మంచిదన్నట్లు వైద్యులు సూచించారట.
శనివారం మ్యాచ్ సమయానికి కోలుకోకపోతే అతని స్థానంలో రిషబ్ పంత్ కీపింగ్ గ్లౌజులతో బరిలోకి దిగుతాడు. బ్యాటింగ్ ఆప్షన్లలో కేఎల్ రాహుల్, అంబటి రాయుడు పైన ఆశలు పెట్టుకున్న భారత్.. తొలి వన్డేకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.
Read Also : ఫోర్ బోనస్ : 24 వేళ్లతో పుట్టిన బాబు
Snapshots from training session on 1st ODI eve in Hyderabad #TeamIndia #INDvAUS @Paytm pic.twitter.com/o2244oniTl
— BCCI (@BCCI) March 1, 2019