Haryana : ధోనీ కోసం 1400 కిలోమీటర్లు నడిచాడు..తీరా అక్కడకు వెళ్లి చూస్తే
భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పిలుచుకొనే ధోనీ కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 1400 కిలోమీటర్లు నడిచి..రాంచీకి చేరుకున్నాడు.

Dhoni
MS Dhoni’s Biggest Fan : భారత మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ గా పిలుచుకొనే ధోనీ కోసం ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా 1400 కిలోమీటర్లు నడిచి..రాంచీకి చేరుకున్నాడు. ఇంత దూరం వెళ్లిన తర్వాత..అక్కడ ధోనీ లేకపోవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. ఆ..ఏముంది..ధోనీ వచ్చే వరకు ఇక్కడే ఉంటా..ఆయన తనతో మాట్లాడిన తర్వాతే..బయలుదేరుతా అంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఓ వ్యక్తి…ధోనీ వచ్చే వరకు చాలా రోజులు పడుతుంది..ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫ్లైట్ టికెట్ ఇచ్చి పంపించాడు. జుట్టుకు ఎల్లో, ఆరెంజ్, బ్లూ కలర్ వేసుకుని భిన్నంగా కనిపిస్తున్న ఇతగాడి వ్యవహారం..సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.
Read More : Tirumala : తిరుమలలో “సంప్రదాయ భోజనం”
ఇతను ఎవరు ?
హర్యాణా రాష్ట్రంలో అజయ్ గిల్ (18) యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతనికి క్రికెట్ ఎంతో ఇష్టం. టీమిండియాలో ధోనీ అంటే..వీరాభిమానం. క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. అయితే..ధోనీ రిటైర్ మెంట్ ప్రకటించడంతో క్రికెట్ ఆడడం మానేశాడు. ఎలాగైనా ధోనీని కలవాలని డిసైడ్ అయ్యాడు. హర్యాణా రాష్ట్రం నుంచి ధోనీ ఉండే రాంచీకి కాలినడనక బయలుదేరాడు. జూలై 29వ తేదీన బయలుదేరాడు. 17 రోజుల పాటు నడిచిన అజయ్…రాంచీకి చేరుకున్నాడు. మొత్తం 1400 కిలోమీట్లర్లు నడిచాడు. అయితే..రాంచీకి చేరుకున్న తర్వాత..అసలు విషయం తెలిసింది. రాంచీకి చేరుకున్న రెండు రోజుల ముందే..ఐపీఎల్ కోసం ధోనీ దుబాయ్ కు వెళ్లిపోయాడని తెలుసుకున్నాడు.
Read More : Nayanthara : పెళ్లిపై స్పందించిన నయన్.. ఆయనే మా ఆయన!
ఫ్లైట్ టికెట్ ఇప్పించిన ఓ వ్యక్తి ?
తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడు. అయినా..ఏముంది..ధోనీ వచ్చే వరకు ఇక్కడే ఉంటానని అజయ్ స్పష్టం చేశాడు. ఇంతదూరం కాలినడకన వచ్చినందుకు ధోనీ తనతో పది నిమిషాలైనా మాట్లాడుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అజయ్ గురించి తెలుసుకున్న అనురాజ్ యువకుడిని ఓ హోటల్ రూంకి తీసుకెళ్లాడు. ధోనీ వచ్చేందుకు చాలా రోజులు పడుతుందని, ఇంటికి వెళ్లాలని సూచించి..ఢిల్లీ వరకు ఫ్లైట్ టికెట్ అందించాడు. మహీంద్ర సింగ్ ధోనీ వచ్చాక..మళ్లీ రావాలని సూచించాడు.
Read More : India vs England : తడబడిన ఇండియా, ఇంగ్లండ్ బాల్ ట్యాంపరింగ్ చేసిందా?
ఇతను ఎవరు ?
అయితే..భిన్నంగా కనిపించడంపై అజయ్ స్పందించారు. ధోనీని కలిసేందుకు వెళుతున్నట్లు తెలుసుకున్న ఓ సోనేపత్ లోని బార్బర్ తనను ఈ విధంగా తయారు చేశాడన్నారు. జుట్టుకు ఎల్లో, ఆరెంజ్, బ్లూ కలర్స్ వేసుకుని తలకు రెండు వైపులా…ధోనీ, మహీ అనే పేర్లతో కనిపించాడు. మొత్తానికి ఇతని వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.