MS Dhoni’s Daughter Ziva : ధోని కుమార్తె జీవా ఏ స్కూల్‌లో చదువుతుందంటే…ఆ స్కూలు ఫీజు తెలిస్తే షాక్ అవుతారు
ప్రస్థుతం 3వతరగతి చదువుతున్న జీవా రాంచీ నగరంలోని తౌరియన్ వరల్డ్ స్కూలుకు వెళుతోంది. జీవా చదివే ఇంటర్నేషనల్ స్కూలులో ఫీజు తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే....
MS Dhoni’s Daughter Ziva : చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని కుమార్తె జీవా ప్రస్థుతం 3వతరగతి చదువుతోంది. క్రికెటరుగా ధోని వివిధ వాణిజ్య ఒప్పందాలు, ఐపిఎల్ కాంట్రాక్టులు, ఇతర వ్యాపారాల ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోని అత్యంత ధనవంతుడిగా మారినా తన కుటుంబాన్ని మాత్రం తన జన్మస్థలమైన జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ నగరంలోనే నివాసముంటున్నారు.
Onion prices : ఈ నెలాఖరు నాటికి కిలో ఉల్లి రూ.70 …క్రిసిల్ మార్కెట్ ఇంటలిజెన్స్ హెచ్చరిక
ఐశ్వర్యం వరించినా జన్మస్థలాన్ని వీడకుండా ఇక్కడే ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. ధోని తన 8 ఏళ్ల కుమార్తెను సైతం తన జన్మస్థలమైన రాంచీలోనే చదివిస్తున్నారు. (MS Dhoni’s Daughter Ziva) ప్రస్థుతం 3వతరగతి చదువుతున్న జీవా రాంచీ నగరంలోని తౌరియన్ వరల్డ్ స్కూలుకు వెళుతోంది. ( Ziva Studies In THIS Elite School) జీవా చదివే ఇంటర్నేషనల్ స్కూలులో ఫీజు తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. ( Annual Fees Will SHOCK You) జీవా 3వతరగతి వార్షిక స్కూలు ఫీజు సంవత్సరానికి డే స్కాలర్ కు 2,75,000రూపాయలు చెల్లించారు.
Manipur : మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ…ముగ్గురి మృతి, ఇళ్లు దహనం
తన కుమార్తె జీవా అకడమిక్స్‌లో కానీ, స్పోర్ట్స్‌లో కానీ, ఆర్ట్స్‌లో కానీ వెనుకబడి ఉండడం ధోనీకి ఇష్టం లేదు. అందుకే ఆమెను అంతర్జాతీయ పాఠశాలలో చేర్చారు. ధోనీ తనయ జీవాకు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు ఉంది. జీవా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 2.3 మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు. ఆమె ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో గ్రౌండ్‌లో తన తండ్రి కోసం ఉత్సాహంగా ఉండడాన్ని ప్రేక్షకులు చూశారు. ప్రపంచంలోనే తన తండ్రి అయిన ధోనీకి జీవా పెద్ద ఫ్యాన్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.