Cricketer Tilak Varma: హైదరాబాద్‌ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సచిన్, రోహిత్ సహా ముంబయి ఇండియన్స్ టీం సందడి ..

ముంబై ఇండియన్స్ టీం సభ్యులు హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తిలక్ వర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు.

Cricketer Tilak Varma: హైదరాబాద్‌ క్రికెటర్ తిలక్ వర్మ ఇంట్లో సచిన్, రోహిత్ సహా ముంబయి ఇండియన్స్ టీం సందడి ..

Mumbai Indians team players in Tilak Varma House (Photo: Tilak Twitter)

Updated On : April 18, 2023 / 7:58 AM IST

Cricketer Tilak Varma: ఐపీఎల్ -2023 (IPL 2023)  సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుండటంతో క్రికెట్ ఫ్యాన్స్ ఉత్కంఠతతో వీక్షిస్తున్నారు. హైదరాబాద్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)  మంగళవారం ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టుతో తలపడనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (Rajiv Gandhi International Stadium) లో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్ టీం సభ్యులు (Mumbai Indians team members) హైదరాబాద్ చేరుకున్నారు.

IPL 2023, RCB vs CSK: బెంగళూరుపై చెన్నై గెలుపు Live Updates

ముంబై ఇండియన్స్ జట్టులో హైదరాబాద్‌కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఆడుతున్నాడు. టీం సభ్యులు హైదరాబాద్ రావటంతో వారికి సోమవారం రాత్రి తన ఇంట్లో  విందును ఇచ్చారు. ఈ విందులో సచిన్ టెండుల్కర్, సచిన్ కుమారుడు అర్జున్ టెండుల్కర్, కెప్టెన్ రోహిత్ శర్మతో సహా టీం సభ్యులందరూ పాల్గొని సందడి చేశారు. తిలక్ వర్మ, అతని కుటుంబ సభ్యులు సచిన్, ఇతర టీం సభ్యులతో ఫొటోలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తిలక్ వర్మ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు.

 

 

ముంబై ఇండియన్స్ సభ్యులకు నా ఇంటి వద్ద విందుకోసం ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. నా కుటుంబ సభ్యులు, నేను మర్చిపోలేని రాత్రి ఇది. నా ఆహ్వానం మన్నించి తన ఇంటికి వచ్చినందుకు టీం సభ్యులకు ధన్యవాదాలు అంటూ తన ట్వీట్ కు తిలక్ వర్మ క్యాప్షన్ ఇచ్చాడు.

IPL 2023: హార్దిక్ పాండ్యా స్లెడ్జింగ్ ప్రయత్నాన్ని ఇలా విఫలం చేసిన సంజూ శాంసన్

 

ఐపీఎల్ – 2023లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ తరపున ఆడిన మ్యాచ్ లలో తిలక్ వర్మ అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ఈ 20ఏళ్ల కుర్రాడు నాలుగు మ్యాచ్‌లలో 59 సగటుతో 150 స్ట్రైక్ రేట్ తో 177 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో గెలిచి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగు మ్యాచ్‌లలో రెండు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.