Neeraj Chopra: చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. స్టేడియానికి వెళ్లడానికి లిఫ్ట్ అడిగేవాడిని: హైదరాబాద్‌లో నీరజ్ చోప్రా

నీరజ్‌ చోప్రాతో క‌లిసి సినీనటుడు రాహుల్‌ రవీంద్రన్ బ్రేక్‌ ఫాస్ట్ చేసి ఫొటోలు తీసుకున్నాడు. టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా వారితోనే ఉన్నాడు.

Neeraj Chopra: చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను.. స్టేడియానికి వెళ్లడానికి లిఫ్ట్ అడిగేవాడిని: హైదరాబాద్‌లో నీరజ్ చోప్రా

Neeraj Chopra

Updated On : October 9, 2023 / 4:56 PM IST

Neeraj Chopra: ఆసియా క్రీడ‌ల్లో జావెలిన్‌త్రోలో గోల్డ్ మెడ‌ల్ కైవ‌సం చేసుకున్న నీరజ్ చోప్రా ఇవాళ హైదరాబాద్‌కు వచ్చాడు. నీర‌జ్ చోప్రా ఆసియా క్రీడల్లో 88.88 మీట‌ర్ల దూరం జావెలిన్ విసిరి, పారిస్ ఒలింపిక్స్‌కు కూడా అర్హ‌త సాధించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ఇక్కడకు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు. తాను చిన్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని, స్టేడియానికి వెళ్లడానికి లిఫ్ట్ అడిగేవాడినని గుర్తు చేసుకున్నాడు. క్రీడల్లో ప్రాక్టీస్, ఫిట్నెస్ కోసం డైట్ చాలా ముఖ్యమని తెలిపాడు. చిన్నప్పుడు ఉండే పరిస్థితుల వల్ల అది కూడా ఇబ్బంది అయ్యేదని చెప్పాడు.

ఇప్పుడు పరిస్థితులు మారాయని, క్రీడాకారులకు ప్రభుత్వం అండ్ స్పాన్సర్స్ ఉన్నారని నీరజ్ చెప్రా తెలిపాడు. దేశంలో క్రీడల కోసం సౌకర్యాలు పెరుగుతున్నాయని చెప్పారు. మెడల్స్ సాధించడానికి క్రీడాకారులకు సమయం పడుతుందని, హార్డ్ వర్క్ అవసరమని చెప్పాడు. ఆసియా క్రీడాల్లో భారత్ అనేక పతకాలు సాధించిందని అన్నాడు.

క్రీడల్లో పూర్తి స్థాయిల్లో దృష్టి పెట్టి ఆడాల్సి ఉంటుందని తెలిపాడు. తాను గేమ్ కోసం ఎల్లప్పుడూ కష్టపడుతుంటానని, ప్రతి ఆటలో కొత్తవి నేర్చుకుంటానని చెప్పాడు. కాగా, నీరజ్‌ చోప్రాతో క‌లిసి సినీనటుడు రాహుల్‌ రవీంద్రన్ బ్రేక్‌ ఫాస్ట్ చేసి ఫొటోలు తీసుకున్నాడు. టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ కూడా వారితోనే ఉన్నాడు.

ODI World Cup 2023 : గెలుపు జోష్‌లో ఉన్న టీమ్ఇండియాకు షాక్‌.. రెండో మ్యాచ్‌కు స్టార్ ఆట‌గాడు దూరం