T20 World Cup: బాబోయ్.. 142 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్

నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ బాస్ డి లీడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 6వ ఓవర్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయగా బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి. ఓ బంతి 142 కి.మీ వేగంతో దూసుకురావడంతో దానిని షాట్ కొట్టే ప్రయత్నంలో బాస్ డి లీడ్ విఫలమయ్యాడు. ఆ రాకాసి బౌన్సర్ నేరుగా అతని ముఖానికి ఉన్న హెల్మెంట్ కు బలంగా తాకింది.

T20 World Cup: బాబోయ్.. 142 కి.మీ వేగంతో దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్

T20 World Cup

Updated On : October 31, 2022 / 8:35 AM IST

T20 World Cup: క్రికెట్‌లో కొన్నిసార్లు బౌలర్లు వేసే బంతులు ఊహించని రీతిలో దూసుకొచ్చి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతుంటాయి. ముఖ్యంగా బౌలింగ్ పిచ్‌పై ఆడే సమయంలో బాల్ వేగంగా బౌన్స్ అవుతుంది. ఆ సమయంలో బ్యాటర్లు అప్రమత్తంగా ఉండకపోతే గాయాలపాలు కావాల్సి వస్తుంది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఆదివారం పాకిస్థాన్ వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్ బ్యాటర్ కు కొద్దిలో పెద్ద ప్రమాదం తప్పింది.

T20 World Cup : ముక్కుతూ మూలుగుతూ.. ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ విజయం

నెదర్లాండ్స్ జట్టు బ్యాటర్ బాస్ డి లీడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. 6వ ఓవర్‌లో పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బౌలింగ్ చేయగా బంతులు వేగంగా దూసుకొస్తున్నాయి. ఓ బంతి 142 కి.మీ వేగంతో దూసుకురావడంతో దానిని షాట్ కొట్టే ప్రయత్నంలో బాస్ డి లీడ్ విఫలమయ్యాడు. ఆ రాకాసి బౌన్సర్ నేరుగా అతని ముఖానికి ఉన్న హెల్మెంట్ కు బలంగా తాకింది. దీంతో లీడ్ ముఖానికి బలమైన గాయం కావటంతో పాటు రక్తం కూడా వచ్చింది.

తీవ్రంగా గాయపడ్డ లీడ్ సహచరుల సహాయంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. లీడ్ కంటి కింద భాగంలో గాయమైంది. కొంచెం పైకి తగిలిఉంటే కన్నుకు ప్రమాదం ఏర్పడేది. మ్యాచ్ పూర్తయిన అనంతరం మైదానంలోకి వచ్చిన నెదర్లాండ్ బ్యాటర్ లీడ్ ను పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ పరామర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.