T20 World Cup : ముక్కుతూ మూలుగుతూ.. ఎట్టకేలకు వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ విజయం
ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఎట్టకేలకు పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ తొలి విజయం నమోదు చేసింది.

T20 World Cup : ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో ఎట్టకేలకు పాకిస్తాన్ బోణీ కొట్టింది. ఈ టోర్నీ తొలి విజయం నమోదు చేసింది. సూపర్-12 దశ తొలి మ్యాచ్ లో టీమిండియా చేతిలో ఓడిన పాక్, రెండో మ్యాచ్ లో జింబాబ్వేపై దిగ్భ్రాంతికర రీతిలో పరాజయం చవిచూసింది. దాంతో, సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో నేడు పసికూన నెదర్లాండ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
పెర్త్ లో నెదర్లాండ్స్ నిర్దేశించిన 92 పరుగుల విజయలక్ష్యాన్ని పాక్ 13.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఛేదనలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ బాబర్ అజామ్ 4 పరుగులకే రనౌట్ కాగా, రిజ్వాన్ 39 బంతుల్లోనే 49 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టాడు. ఫఖర్ జమాన్ 20, షాన్ మసూద్ 12 పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో బ్రాండన్ గ్లోవర్ రెండు వికెట్లు తీశాడు. పాల్ వాన్ మీకెరెన్ ఒక వికెట్ తీశాడు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
తొలుత పాక్ బౌలర్లు షాదాబ్ ఖాన్ (3/22), మహ్మద్ వసీం జూనియర్ (2/15), షాహీన్ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్ రౌఫ్ (1/10) సత్తా చాటడంతో నెదర్లాండ్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులే చేసింది. ఛేదనలో పాకిస్తాన్ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది. నెదర్లాండ్స్ నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్ రిజ్వాన్ (49), ఫఖర్ జమాన్ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్ కావడంతో పాక్ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది.