NZ vs ENG : ఇంగ్లాండ్‌కు షాకిచ్చిన కివీస్.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే..
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డేలో (NZ vs ENG) న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
New Zealand won by 5 wickets in 2nd odi against england
NZ vs ENG : ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (NZ vs ENG) కివీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ బౌలర్ల ధాటికి 36 ఓవర్లలో 175 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ ఓవర్టన్ ( 42; 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ హ్యారీ బ్రూక్ (34; 34 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు.
IND vs AUS : వర్షం కారణంగా భారత్, ఆసీస్ తొలి టీ20 మ్యాచ్ రద్దు..
A five-wicket win seals the Chemist Warehouse ODI series with a game in hand 👊
Catch the full score at https://t.co/3YsfR1Y3Sm or on the NZC app.
📸 @PhotosportNZ pic.twitter.com/4Ss8HYqR1G
— BLACKCAPS (@BLACKCAPS) October 29, 2025
మిగిలిన వారిలో జోరూట్ (25) పర్వాలేనిపించాడు. కివీస్ బౌలర్లలో బ్లెయిర్ టిక్నర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాథన్ స్మిత్ రెండు వికెట్లు తీశాడు. జాకబ్ డఫీ, జాకరీ ఫౌల్క్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం రచిన్ రవీంద్ర (54; 58 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (56 నాటౌట్; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు)లు హాఫ్ సెంచరీలు బాదగా, మిచెల్ సాంట్నర్ (34 నాటౌట్; 17 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో 176 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్ 33.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇంగ్లీష్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు. జేమీ ఓవర్టన్, ఆదిల్ రషీద్ చెరో వికెట్ పడగొట్టాడు.
ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టీ20 మ్యాచ్ వెల్లింగ్టన్ వేదికగా నవంబర్ 1న జరగనుంది.
