IND vs AUS : వర్షం కారణంగా భారత్, ఆసీస్ తొలి టీ20 మ్యాచ్ రద్దు..
వర్షం కారణంగా భారత్, ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) తొలి టీ20 మ్యాచ్ రద్దైంది.
IND vs AUS 1st t20 called off due to rain
IND vs AUS : భారత్, ఆసీస్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ రద్దైంది. వర్షం కారణంగా ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
కాన్‌బెర్రా ఆతిథ్యం ఇచ్చిన ఈ మ్యాచ్‌లో (IND vs AUS )ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. మరో ఆలోచన లేకుండా ఆ జట్టు కెప్టెన్ మిచెల్ మార్ష్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. టీమ్ఇండియాకు ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ లు శుభారంభం అందించారు.
14 బంతుల్లో 4 ఫోర్లతో 19 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న అభిషేక్ శర్మ ను నాథన్ ఎల్లిస్ ఔట్ చేశాడు. గిల్-అభిషేక్ జోడీ తొలి వికెట్‌కు 3.5 ఓవర్లలో 35 పరుగులు జోడించారు. ఆ తరువాత వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఎట్టకేలకు ఫామ్ అందుకున్నాడు.
The first #AUSvIND T20I has been abandoned due to rain. 🌧️
Scorecard ▶️ https://t.co/VE4FvHBCbW#TeamIndia pic.twitter.com/biJYDFe9Ah
— BCCI (@BCCI) October 29, 2025
భారత ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తికాగానే వరుణుడు తొలి సారి ఆటంకం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించారు. మ్యాచ్ పునఃప్రారంభమైన తరువాత సూర్య, గిల్‌లు తమదైన శైలిలో బౌండరీలు బాదుతూ పరుగులు రాబట్టారు. భారత ఇన్నింగ్స్ 9.4 ఓవర్ల సమయంలో వరుణుడు మరోసారి వర్షం అంతరాయం కలిగించాడు. ఆ సమయానికి భారత్ వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది.
Suryakumar Yadav : టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత..
వర్షం చాలా సేపు పడింది. వర్షం నిలిచిపోయినప్పటికి కూడా మ్యాచ్‌ను నిర్వహించే పరిస్థితులు లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇరు జట్ల మధ్య అక్టోబర్ 31న మెల్‌బోర్న్ వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.
