Rohit Sharma : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గిల్‌ను వెనక్కి నెట్టి..
ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ICC rankings Rohit Sharma topples Shubman Gill to become number 1 ODI batter
Rohit Sharma : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో 38 ఏళ్ల 182 రోజుల వయసులో వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన తొలి ఆటగాడిగా హిట్‌మ్యాన్ చరిత్ర సృష్టించాడు.
ఆసీస్‌తో ఇటీవల జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma) అద్భుత ప్రదర్శన కనబరిచాడు. తొలి వన్డేలో విఫలమైనప్పటికి రెండో వన్డేలో హాఫ్ సెంచరీ (73), మూడో వన్డేలో భారీ శతకం (121 నాటౌట్)తో రాణించాడు. ఈ ఇన్నింగ్స్‌ల కారణంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి అగ్రస్థానానికి ఎగబాకాడు. రోహిత్ శర్మ ఖాతాలో ప్రస్తుతం 781 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.
Suryakumar Yadav : టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత..
India great takes the No.1 spot for the very first time in the ICC Men’s ODI Player Rankings 🤩
Read more ⬇️https://t.co/4IgBu2txdo
— ICC (@ICC) October 29, 2025
అఫ్గానిస్తాన్ స్టార్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ 764 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక నిన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్ ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో విఫలం కావడంతో రెండు స్థానాలు కోల్పోయి మూడో స్థానానికి పడిపోయాడు. అతడి ఖాతాలో 745 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ఇక పాక్ ఆటగాడు బాబర్ ఆజామ్ నాలుగో స్థానంలో ఉండగా, టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఐసీసీ వన్డే టాప్-5 బ్యాటర్ల ర్యాంకింగ్స్ ఇవే..
* రోహిత్ శర్మ (భారత్) – 781 రేటింగ్ పాయింట్లు
* ఇబ్రహీం జద్రాన్ (అఫ్గానిస్తాన్) – 764 రేటింగ్ పాయింట్లు
* శుభ్‌మన్ గిల్ (భారత్) – 745 రేటింగ్ పాయింట్లు
* బాబర్ ఆజామ్ (పాకిస్తాన్) – 739 రేటింగ్ పాయింట్లు
* డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) – 734 రేటింగ్ పాయింట్లు
