Suryakumar Yadav : టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌..

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) 150 సిక్స‌ర్ల‌ను పూర్తి చేసుకున్నాడు.

Suryakumar Yadav : టీ20ల్లో సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన ఘ‌న‌త‌..

IND vs AUS 1st T20 Suryakumar Yadav completes 150 sixes in T20 Internationals

Updated On : October 29, 2025 / 3:47 PM IST

Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో 150 సిక్స‌ర్లను పూర్తి చేసుకున్నాడు. ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో అత‌డు రెండు సిక్స‌ర్ల‌ను బాది ఈ ఘ‌న‌త సాధించాడు. ఇన్నింగ్స్ 10వ ఓవ‌ర్‌లో నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో మూడో బంతికి సిక్స్ కొట్టి అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.

Ruturaj Gaikwad : డ‌బుల్ సెంచ‌రీ చేసిన పృథ్వీ షాకు నో అవార్డు.. రుతురాజ్ గైక్వాడ్ ఏం చేశాడంటే..?

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన రికార్డు టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ పేరిట ఉంది. హిట్‌మ్యాన్ 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు కొట్టాడు. ముహమ్మద్ వసీం, మార్టిన్ గుప్టిల్‌, జోస్ బ‌ట్ల‌ర్‌లు సూర్య (Suryakumar Yadav )క‌న్నా ముందే 150 సిక్స‌ర్ల మైలురాయిని చేరుకున్నారు.

అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్లు వీరే..

* రోహిత్ శ‌ర్మ (భార‌త్‌) – 159 మ్యాచ్‌ల్లో 205 సిక్స‌ర్లు
* ముహమ్మద్ వసీం (యూఏఈ) – 91 మ్యాచ్‌ల్లో 187 సిక్స‌ర్లు
* మార్టిన్ గుప్టిల్ (న్యూజిలాండ్‌) – 122 మ్యాచ్‌ల్లో 173 సిక్స‌ర్లు
* జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లాండ్) – 144 మ్యాచ్‌ల్లో 172 సిక్స‌ర్లు
* సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌) – 91 మ్యాచ్‌ల్లో 150* సిక్స‌ర్లు

Babar Azam : ఇది క‌దా బాబ‌ర్ ఆజామ్ అంటే.. టీ20 రీఎంట్రీలో 2 బంతుల్లోనే.. సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌రచ్చ‌..

ఇక భార‌త్‌, ఆసీస్ తొలి టీ20 మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న భార‌త్ వ‌ర్షం వ‌ల్ల ఆట నిలిచిపోయే స‌మ‌యానికి 9.4 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 97 ప‌రుగులు చేసింది. సూర్య‌కుమార్ యాద‌వ్ (39 నాటౌట్; 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), శుభ్‌మ‌న్ గిల్ (37 నాటౌట్; 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) క్రీజులో ఉన్నారు.