బర్త్ డే గిఫ్ట్: ఎయిరిండియా విమానంపై గాంధీ బొమ్మ

జాతిపిత మహాత్మగాంధీ 150వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రభుత్వాధీనంలో పని చేస్తున్న ఎయిరిండియా విమానాలపై జాతిపిత లోగో ఉంచాలని నిర్ణయించింది. స్వాతంత్రోద్యమంలో అహింసా విధానం ద్వారా పోరాటం చేసిన గాంధీ సిద్ధాంతాలు ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. ఆయన 150వ జన్మదినాన్ని ప్రపంచ మంతా తెలిసేలా చేయాలని ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ లోగో ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. ఇక 150లోని సున్నా చర్ఖాన్ని ప్రతిబింబిస్తోంది. ఎడమవైపున గాంధీ కర్రతో నిల్చొని ఉన్న బొమ్మ ఉంటుంది. ఒకటి బదులు ఆయన చేతిలోని కర్ర సరిపోయేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ లోగో ఎయిర్‍బస్ ఏ319, ఏ320లపై మాత్రమే ఉంచారు. ఆ రెండూ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లెయిట్‌లుగా పనిచేస్తాయి. మొత్తం 163ఎయిర్ క్రాఫ్ట్‌లపై ముద్రించనున్నారు.
అంతేకాకుండా రైళ్ల మీద, మెట్రో రైళ్లలోనూ, రాష్ట బస్సులపైనా గాంధీ బొమ్మను ఉంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందట.