Nicholas Pooran : గేల్ ప్రపంచ రికార్డు బద్దలు.. సిక్సర్ల కింగ్ నికోలస్ పూరన్..
వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు.

Nicholas Pooran Breaks Chris Gayles All Time Record Of Most Sixes In A Calendar Year
Nicholas Pooran : వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు నికోలస్ పూరన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2024లో అతడు దీన్ని అందుకున్నాడు. ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ తరుపున ఆడుతున్న పూరన్ సెయింట్ కిట్స్ నెవిస్ పేట్రియాట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పెను విధ్వంసం సృష్టించాడు. 43 బంతులను ఎదుర్కొన్న పూరన్ 7 ఫోర్లు, 9 సిక్సర్లను బాది 97 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్‌లో పూరన్ 9 సిక్సర్లను బాదడంతో వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు క్రిస్‌గేల్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. 2015లో గేల్ 36 టీ20 మ్యాచులు ఆడి 135 సిక్సర్లు బాదాడు. కాగా.. ఈ ఏడాదిలో పూరన్ 58 మ్యాచుల్లో 139 సిక్సర్లు బాదాడు.
AUS vs IND : భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా.. మైండ్ గేమ్స్ మొదలు.. పాపం స్టీవ్‌స్మిత్..
టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్లు..
నికోలస్ పూరన్ – 139 సిక్సర్లు (2024)
క్రిస్ గేల్ – 135 సిక్సర్లు (2015)
క్రిస్ గేల్ – 121 సిక్సర్లు (2012)
క్రిస్ గేల్ – 116 సిక్సర్లు (2011)
క్రిస్ గేల్ – 112 సిక్సర్లు (2016)
క్రిస్ గేల్ – 101 సిక్సర్లు (2017)
ఆండ్రీ రస్సెల్ – 101 సిక్సర్లు (2019)
క్రిస్ గేల్ – 100 సిక్సర్లు (2013)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పూరన్ విధ్వంసానికి తోడు కీసీ కార్తీ (35 బంతుల్లో 73) దూకుడుగా ఆడడంతో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ 4 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సెయింట్ నెవిస్ పేట్రియాట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 208 పరుగులు మాత్రమే చేసింది.
Rohit Sharma : రోహిత్ శర్మ పై అంపైర్ అనిల్ చౌదర్ కీలక వ్యాఖ్యలు..