Nicholas Pooran : నికోలస్ పూరన్ ఊచకోత.. సెంచరీ తరువాత సెలబ్రేషన్స్ వైరల్
వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2023లో విధ్వంసకర ఆటతీరుతో అలరిస్తున్నాడు. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్ బార్చడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
![Nicholas Pooran : నికోలస్ పూరన్ ఊచకోత.. సెంచరీ తరువాత సెలబ్రేషన్స్ వైరల్ Nicholas Pooran : నికోలస్ పూరన్ ఊచకోత.. సెంచరీ తరువాత సెలబ్రేషన్స్ వైరల్](https://10tv.in/wp-content/uploads/2023/09/Nicholas-Pooran.jpg)
Nicholas Pooran century
Nicholas Pooran century : వెస్టిండీస్ ఆటగాడు నికోలస్ పూరన్ (Nicholas Pooran) కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2023లో విధ్వంసకర ఆటతీరుతో అలరిస్తున్నాడు. సీపీఎల్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పూరన్ బార్చడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సిక్సర్లలతో మైదానాన్ని హోరెత్తించాడు. కేవలం 51 బంతుల్లో శతకాన్ని అందుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మొదట బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ మార్క్ దేయల్ (6) తొందరగానే ఔట్ కావడంతో మూడో ఓవర్లోనే నికోలస్ పూరన్ (102 నాటౌట్; 53 బంతుల్లో 5 ఫోర్లు, 10 సిక్సర్లు) బ్యాటింగ్‌కు వచ్చాడు. తన దైన శైలిలో షాట్లు ఆడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 51 బంతుల్లోనే 5 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో శతకాన్ని అందుకున్నాడు. సీపీఎల్‌లో అతడికి ఇది రెండవ శతకం కావడం గమనార్హం.
MS Dhoni : యూఎస్ ఓపెన్‌లో ఎంఎస్ ధోనీ సందడి.. వీడియో వైరల్
ఆఖరి ఓవర్లో 14 పరుగులు అవసరం కాగా..
ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ సమయానికి పూరన్ 86 పరుగులతో క్రీజులో ఉన్నాడు. దీంతో అతడు సెంచరీ చేస్తాడా లేదా అన్న సందేహం అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. శతకానికి 14 పరుగులు అవసరం. కైల్ మేయర్స్ 20వ ఓవర్‌ను వేశాడు. అయితే.. మొదటి రెండు బంతులను సిక్స్‌లుగా మలిచాడు పూరన్. మూడో బంతి డాట్ కాగా నాలుగో బంతికి ఫోర్ కొట్టి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.
సెంచరీ అనంతరం పూరన్ విజయగర్వంతో గర్జించాడు. తన హెల్మెట్‌ను తీసివేసి, బ్యాట్‌ను దూరంగా విసిరేశాడు. ఆనందంతో గాలిలో పంచ్‌లు ఇచ్చాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న సునీల్ నరైన్ వచ్చి పూరన్‌ను కౌగిలించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ పూరన్ విధ్వంసకర శతకం బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన బార్బడోస్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయిన 166 పరుగులకే పరిమితమైంది. దీంతో నైట్‌రైడర్స్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కైల్ మేయర్ (70) రాణించినా మిగిలిన వారు విఫలం కావడంతో బార్చడోస్కు ఓటమి తప్పలేదు.
Pooran Perfection! The local boy has shown us what he can do once again. Queen’s Park Oval is on fire right now and Pooran 💯 lit the match! #CPL23 #TKRvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #Pooran #NicholasPooran pic.twitter.com/CXpmEnSGbL
— CPL T20 (@CPL) September 7, 2023