Reliance Foundation ESA Cup : డియెగో స్క్వార్ట్జ్‌మాన్‌కు రిలయన్స్ ఫౌండేషన్ ESA కప్‌ను అందజేసిన నీతా అంబానీ
యూకే బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ పార్క్‌లో జరుగుతున్న బుడల్స్ టెన్నిస్ టోర్నమెంట్ (Boodles Tennis event)లో పాల్గొన్న టెన్నిస్ ఆటగాడు డియెగో స్క్వార్ట్జ్మాన్ (Diego Schwartzman ) రిలయన్స్ ఫౌండేషన్ ESA కప్ ను అందుకున్నాడు.

Nita Ambani presents Reliance Foundation ESA Cup to Diego Schwartzman
Reliance Foundation ESA Cup 2023 : యూకే బకింగ్‌హామ్‌షైర్‌లోని స్టోక్ పార్క్‌లో జరుగుతున్న బుడల్స్ టెన్నిస్ టోర్నమెంట్ (Boodles Tennis event)లో పాల్గొన్న టెన్నిస్ ఆటగాడు డియెగో స్క్వార్ట్జ్మాన్ (Diego Schwartzman ) రిలయన్స్ ఫౌండేషన్ ESA కప్ ను అందుకున్నాడు. రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) దీన్ని అందించారు. బుడల్స్ టెన్నిస్ (Boodles Tennis) టోర్నమెంట్ ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఇది ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్ల్రాండ్ స్లామ్ టోర్నీకి సన్నాహకంగా జరుగుతుంటుంది.
ఈ సారి జూన్ 27 నుంచి జూలై 1 వరకు అంటే మొత్తం ఐదు రోజుల పాటు టోర్నీని జరుగుతోంది. ఈ టోర్నీ జరిగే ప్రతి రోజు రిలయన్స్ ఫౌండేషన్ ESA కప్ ను ఆటగాళ్లకు అందిస్తుంటారు. డియెగో ష్వార్ట్‌జ్‌మన్ తో పాటు సిట్సిపాస్, ఫెలిక్స్ అగర్, హోల్గర్ రునె, ఆండ్రీ రుబ్లెవ్ లు బుడల్స్ టెన్నిస్ టోర్నమెంట్ లో పాల్గొంటున్నారు.
ఇక డియెగో ష్వార్ట్‌జ్‌మన్, ఫెలిక్స్ అగర్ ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో డియెగో ష్వార్ట్‌జ్‌మన్ విజయం సాధించాడు. 7-5, 5-7, 10-5 తేడాతో గెలుపొందాడు. అనంతరం నీతా అంబానీ ESA కప్‌ను అందించింది. ఆ తరువాత నీతా అంబానీ బకింగ్‌హామ్‌షైర్‌లో ఉన్న యాక్షన్ ఫర్ యూత్(Action4Youth)కు విరాళం ఇచ్చారు.
ఈ సందర్భంగా నీతా అంబానీ మాట్లాడుతూ.. టెన్నిస్‌లో ఓ గొప్ప మ్యాచ్ ను చూసినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మ్యాచ్ సందర్భంగా విరాళం ఇవ్వడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ ఛారిటీ వల్ల చిన్నారులు తమకు ఇష్టమైన స్పోర్ట్స్‌ను ఎంచుకునేందుకు అవకాశం కలిగిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు.
ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ (ESA) అనేది నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ (రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క CSR విభాగం) నిర్వహిస్తున్న ఒక సమగ్ర అభివృద్ధి కార్యక్రమం. చిన్నారులు విద్య మరియు క్రీడలలో సమాన అవకాశాలను ప్రోత్సహించే వివిధ కార్యక్రమాలకు మద్దతు ఇస్తుంటుంది.