Nita Ambani : ఓ భారతీయురాలిగా గర్విస్తున్నా.. మన దేశంలో క్రికెట్ అనేది ఓ గేమ్ కాదు.. : నీతా అంబానీ
ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కావడంపై ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ స్పందించారు.

Nita Ambani welcomes inclusion of cricket
Nita Ambani welcomes inclusion of cricket : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు శుభవార్త ఇది. ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగమైంది. లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్‌లో క్రికెట్‌కు చోటు దక్కింది. క్రికెట్‌తో పాటు మరో నాలుగు ఆటలు బేస్‍బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్‍బాల్, స్క్వాష్, లాక్రోస్ లను చేర్చేందుకు ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ వెల్లడించారు.
లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మరో నాలుగు ఆటలను ప్రవేశ పెట్టాలని నిర్వాహకులు ప్రతి పాదించారు. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఎగ్జిక్యూటీవ్ బోర్డు శుక్రవారం (అక్టోబర్ 13న) ఆమోదం తెలిపింది. దీనిపై నేడు (సోమవారం అక్టోబర్ 16న) ఓటింగ్ జరిగింది. ఇద్దరు సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయగా మిగిలిన వారు అనుకూలంగా ఓటు వేశారు.
భారతీయురాలిగా గర్విస్తున్నా..
ఒలింపిక్స్‌లో క్రికెట్ భాగం కావడంపై ఐఓసీ సభ్యురాలు నీతా అంబానీ స్పందించారు. లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ క్రీడల కోసం స్పోర్ట్స్ ప్రోగ్రామ్‌లో క్రికెట్‌ను చేర్చడం స్వాగతించదగిందన్నారు. ఇది ప్రపంచంలోని కొత్త భౌగోళిక ప్రాంతాలలో ఒలింపిక్ ఉద్యమానికి చాలా కొత్త ఆసక్తిని, అవకాశాలను ఆకర్షిస్తుందన్నారు.
Rashid Khan : ఢిల్లీ ప్రజల పై అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కామెంట్స్.. వైరల్

Nita Ambani welcomes inclusion of cricket
ఓ క్రికెట్ అభిమానిగా, ఐఓసీ సభ్యురాలిగా, ఓ భారతీయురాలిగా ఎంతో గర్విస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టపడే క్రీడల్లో క్రికెట్ ఒకన్నారు. అత్యధిక మంది మ్యాచులను చూసేందుకు ఇష్టపడతారన్నారు. 1.4 బిలియన్ల భారతీయులకు క్రికెట్ కేవలం ఓ ఆట కాదని, ఓ మతం అని అన్నారు. మన దేశంలోని ముంబైలో జరుగుతున్న నూట నలభై ఒకటవ ఐఓసీ సెషన్‌లో ఈ చారిత్రాత్మక తీర్మానం ఆమోదించబడినందుకు ఎంతో సంతోషిస్తునట్లు నీతా అంబానీ తెలిపారు.
Nita Ambani welcomes inclusion of cricket
Rohit Sharma : నా కండలు చూశావా..? అంపైర్‌తో రోహిత్ శర్మ.. వీడియో వైరల్
ఈ నిర్ణయం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా క్రీడలకు ఉన్న ఆదరణ మరింత గణనీయస్థాయిలో పెరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. క్రికెట్ పెరుగుతున్న అంతర్జాతీయ ప్రజాదరణకు ప్రోత్సాహాన్ని అందిస్తుందని వెల్లడించారు. ఈ రోజు భారతదేశానికి సంతోషకరమైన రోజని చెప్పారు. ఈ చారిత్రాత్మక తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు ఐఓసీ, లాస్ఏంజిల్స్ ఆర్గనైజింగ్ కమిటికీ కృతజ్ఞతలు, అభినందలు తెలియజేశారు.
#WATCH | On the inclusion of Cricket in the 2028 Los Angeles Summer Olympics, IOC Member Nita Ambani says, “It is a historic day not just for India but all South Asian countries…” pic.twitter.com/9lDNRORdfZ
— ANI (@ANI) October 16, 2023