PAK : జీతాలు ఎప్పుడు పడతాయ్.. 4 నెలలుగా వేచిచూస్తున్న పాక్ క్రికెటర్లు బాబర్ ఆజాం, మహ్మద్ రిజ్వాన్!
పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం నెలకొంది.

No Salary For 4 Months Pakistan Stars Babar Azam Mohmmad Rizwan, Shaheen Afridi Left Waiting
PAK : పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం నెలకొంది. బోర్డు సభ్యులు, కెప్టెన్సీలో మార్పులు చేస్తుండడం, ఆ జట్టు పరాజయాలతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా మరో అంశం తెరపైకి వచ్చింది. పాక్ బోర్డు గత నాలుగు నెలలుగా ఆ దేశ క్రికెటర్లకు జీతాలు ఇవ్వలేదని తెలుస్తోంది. బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిది వంటి స్టార్ ఆటగాళ్లు తదితరులు ఈ జాబితాలో ఉన్నట్లు పాక్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పురుషుల జట్టుకే కాదు, పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టుకు కూడా నాలుగు నెలల జీతం బకాయి ఉందని సదరు కథనాల సారాంశం. మొత్తం 25 మంది సీనియర్ పురుషుల క్రికెటర్లకు 2023 జూలై 1 నుండి 2026 జూన్ 30 వరకు మూడేళ్ల కాంట్రాక్టులు లభించాయి. అయితే.. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా కాంట్రాక్టులపై సమీక్ష జరగనున్నట్లు క్రికెట్ పాకిస్థాన్ నివేదిక పేర్కొంది.
T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ శుభారంభం.. భారత్ జట్టుకు సవాల్.. ఎవరు గెలుస్తారో?
“గతేడాది వన్డే ప్రపంచకప్‌కు ముందు పాక్ ఆటగాళ్లు కొందరు బోర్డు పై ఒత్తిడి తీసుకువచ్చి తమకు అనుకూలంగా కాంట్రాక్ట్‌లను పొందారు. అయితే.. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు నాలుగు నెలలుగా జీతాలు అందడం లేదు. ఇప్పటికే బోర్డు దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. తమ జెర్సీలపై లోగో వేసుకున్నందుకు చెల్లించాల్సిన స్పాన్సర్‌షిప్ పేమెంట్ కూడా బకాయిగానే ఉంది.” అని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
పాకిస్తాన్ పురుషుల క్రికెట్ జట్టు అక్టోబర్ 7 నుండి స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. కాగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు బాబర్ ఆజాం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడి స్థానంలో ఎవరిని నియమిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Hardik Pandya : పాండ్యాకు రూ.18 కోట్లా? అందుకు అతడు అర్హుడేనా? రూ.14 కోట్లు దండగేనా?