Sunil Gavaskar : సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కెప్టెన్ కూల్ ధోని కాదు.. మ‌రెవ‌రంటే..?

మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికి తాను ప్ర‌శాంతంగా ఉంటూ జ‌ట్టును ముందుండి న‌డిపించే కెప్టెన్లు చాలా అరుదు. అలాంటి వారిలో ముందుంటాడు భార‌త మాజీ ఆట‌గాడు, చెన్నైసూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని(MS Dhoni)).

Sunil Gavaskar : సునీల్ గ‌వాస్క‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. కెప్టెన్ కూల్ ధోని కాదు.. మ‌రెవ‌రంటే..?

MS Dhoni-Sunil Gavaskar

Sunil Gavaskar on Captain Cool : మైదానంలో ఎంత ఒత్తిడి ఉన్న‌ప్ప‌టికి తాను ప్ర‌శాంతంగా ఉంటూ జ‌ట్టును ముందుండి న‌డిపించే కెప్టెన్లు చాలా అరుదు. అలాంటి వారిలో ముందుంటాడు భార‌త మాజీ ఆట‌గాడు, చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని (MS Dhoni)). బౌల‌ర్లు ధారాళంగా ప‌రుగులు ఇచ్చినా, ఫీల్డ‌ర్లు క్యాచులు మిస్ చేసిన‌ప్ప‌టికీ అత‌డు కోప్ప‌డిన సంద‌ర్భాలు అరుద‌నే చెప్పాలి. ఈ కార‌ణంగా అభిమానులు, క్రీడాపండితులు అత‌డిని కెప్టెన్ కూల్ (Captain Cool) అని పిలుస్తుంటారు.

అయితే.. భార‌త క్రికెట్ దిగ్గ‌జం సునీల్ గ‌వాస్క‌ర్ (Sunil Gavaskar ) దృష్టిలో మాత్రం మ‌హేంద్రుడు కూల్ కెప్టెన్ కాద‌ట‌. టీమ్ఇండియా ఒరిజిన‌ల్ మిస్ట‌ర్ కూల్ కెప్టెన్ ఎవ‌రో చెప్పేశాడు. అత‌డు మ‌రెవ‌రో కాదు టీమ్ఇండియాకు మొద‌టి సారి ప్ర‌పంచ క‌ప్ క‌ప్‌ను అందించిన క‌పిల్ దేవ్‌ (Kapil Dev).

MS Dhoni: విమానంలో ధోనీకి చాక్లెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. క్యాండీక్రష్ ఆడుతూ ఏం చేశాడంటే? వీడియో వైరల్

క‌పిల్ దేశ్ సార‌ధ్యంలో 1983 ప్ర‌పంచ క‌ప్‌లో టీమ్ఇండియా అండ‌ర్ డాగ్స్‌గా బ‌రిలోకి దిగింది. క‌నీసం ఎవ్వ‌రూ కూడా భార‌త్ ప్ర‌పంచ‌క‌ప్ గెలుస్తుంద‌ని భావించ‌లేదు. అలాంటి స‌మ‌యంలో తాను రాణించ‌డంతో పాటు జ‌ట్టులో స్పూర్తిని నింపుతూ భార‌త్‌ను ఛాంపియ‌న్‌గా నిలిపాడు. టీమ్ఇండియా మొద‌టి సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను అందుకుని నిన్న‌టికి(జూన్ 25) స‌రిగ్గా 40 వ‌సంతాలు పూర్తి అయ్యాయి. ఈ సంద‌ర్భంగా గ‌వాస్క‌ర్ మాట్లాడుతూ అస‌లైన కెప్టెన్ కూల్ క‌పిల్ దేవ్ అని చెప్పాడు.

1983 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో క‌పిల్ దేవ్ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ అద‌ర‌గొట్టాడు. ముఖ్యంగా ఫైన‌ల్‌లో భీక‌ర ఫామ్‌లో ఉన్న వివి రిచ‌ర్డ్స్ క్యాచ్‌ను అందుకున్న సంగ‌తి మరిచిపోకూడ‌దు. ఫార్మాట్‌కు అవ‌స‌ర‌మైన విధంగా అత‌డి కెప్టెన్సీ డైన‌మిక్‌గా ఉండేది. ఎవ‌రైనా ఆట‌గాడు క్యాచ్‌ను వ‌దిలేసినా లేదా మిస్ ఫీల్డ్ చేసిన ప్ప‌టికి క‌పిల్ ముఖంపై చిరున‌వ్వు త‌ప్ప కోపం ఉండేది కాదు. అందుక‌నే అత‌డు అస‌లైన కూల్ కెప్టెన్ అని గ‌వాస్క‌ర్ చెప్పుకొచ్చాడు.

Ravi Shastri : ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత అత‌డే కెప్టెన్.. రోహిత్ ఇక చాలు

కాగా.. ఆ త‌రువాత 28 ఏళ్ల‌కు 2011లో మ‌హేంద్ర సింగ్ ధోని నాయ‌క‌త్వంలో భార‌త్ మ‌రోసారి విశ్వ‌విజేత‌గా నిలిచింది. శ్రీలంక‌తో జ‌రిగిన నాటి ఫైన‌ల్ మ్యాచ్‌లో ధోని సిక్స‌ర్ కొట్టి విజ‌యాన్ని అందించ‌డం స‌గ‌టు క్రీడాభిమాని అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. ఇక ఈ ఏడాది స్వ‌దేశంలో ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మ‌రోసారి భార‌త్ విజేత‌గా నిల‌వాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.