భారీ లక్ష్యంతో బరిలోకి భారత్, హాఫ్ సెంచరీలతో మన్రో, విలియమ్సన్, టేలర్

భారీ లక్ష్యంతో బరిలోకి భారత్, హాఫ్ సెంచరీలతో మన్రో, విలియమ్సన్, టేలర్

Updated On : January 24, 2020 / 8:48 AM IST

కివీస్ గడ్డపై భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియమ్సన్(51; 26బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు)తో మెరుపులు కురిపిస్తే రాస్ టేలర్(54; 27బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ కొలీన్ మన్రో(59; 42బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సులు)తో శుభారంభాన్ని నమోదు చేయడంతో కివీస్ బలమైన ఇన్నింగ్స్ కనబరచింది. 

టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్ ఐదు వికెట్లు పడగొట్టింది. బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, శివమ్ దూబె, రవీంద్ర జడేజాలు తలో వికెట్ తీయగలిగారు. ఓపెనర్ మార్టిన్ గఫ్తిల్(30), టిమ్ సీఫెర్ట్(1), మిచెల్ శాంతర్(2)పరుగులు మాత్రమే చేయగా కాలిన్ గ్రాండ్‌హోమ్(0)డకౌట్ గా వెనుదిరిగాడు. 

భారత ఓపెనర్లు టీ20 స్పెషలిస్టులు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ఆరంభించారు. 

న్యూజిలాండ్:
Martin Guptill, Colin Munro, Kane Williamson (c), Ross Taylor, Tim Seifert (wk), Colin de Grandhomme, Mitchell Santner, Blair Tickner, Tim Southee, Ish Sodhi, Hamish Bennett

టీమిండియా: 
Rohit Sharma, Lokesh Rahul (wk), Virat Kohli (c), Shreyas Iyer, Manish Pandey, Shivam Dube, Ravindra Jadeja, Shardul Thakur, Mohammed Shami, Yuzvendra Chahal, Jasprit Bumrah