ODI World Cup 2023 : కేఎల్ రాహుల్ వ‌స్తే.. సంజు శాంస‌న్ బ‌లి..!

ఈ ఏడాది అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు భార‌త‌దేశంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు ఈ మెగా టోర్నీలో ప్ర‌త్య‌ర్థుల‌పై విజ‌యం సాధించేందుకు అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్థం చేసుకునే ప‌నిలో ఉన్నాయి.

ODI World Cup 2023 : కేఎల్ రాహుల్ వ‌స్తే.. సంజు శాంస‌న్ బ‌లి..!

KL Rahul-Sanju Samson

ODI World Cup : ఈ ఏడాది అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు భార‌త‌దేశంలో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అన్ని జ‌ట్లు ఈ మెగా టోర్నీలో ప్ర‌త్య‌ర్థుల‌పై విజ‌యం సాధించేందుకు అస్త్ర శ‌స్త్రాల‌ను సిద్థం చేసుకునే ప‌నిలో ఉన్నాయి. అయితే.. స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఈ మెగా టోర్నీలో ప‌టిష్ట‌మైన జ‌ట్టుతో బ‌రిలోకి దిగేందుకు టీమ్ఇండియా (Team India) ఇంకా ప్ర‌యోగాలు చేస్తూనే ఉంది.

త‌మ‌కు వ‌చ్చిన అవ‌కాశాల‌ను యువ ఆట‌గాళ్లు స‌ద్వినియోగం చేసుకునే ప‌నిలో ఉండ‌గా, గాయ‌ప‌డి జ‌ట్టుకు దూరం అయిన స్టార్ ఆట‌గాళ్లు తిరిగి వ‌స్తే ప‌రిస్థితి ఏంటా..? అనే దానిపై ప్ర‌స్తుతం చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిపై మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా స్పందించాడు. గాయాల కార‌ణంగా సీనియ‌ర్ ఆట‌గాడు కేఎల్ రాహుల్‌(KL Rahul)తో పాటు యువ ఆట‌గాడు శ్రేయస్ అయ్య‌ర్‌లు ఆట‌కు కొంత‌కాలంగా దూరంగా ఉంటున్నారు.

Ambati Rayudu : మ‌ళ్లీ క్రికెట్ ఆడ‌నున్న‌ రాయుడు.. అయితే మ‌న‌ద‌గ్గ‌ర‌ ఆడ‌డ‌ట‌.. ఇంకెక్క‌డంటే..?

వీరిద్ద‌రు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో కోలుకుంటున్నారు. ప్ర‌స్తుతం వీరు ఫిట్‌నెస్ సాధించే ప‌నిలో ఉన్నారు. ఒక‌వేళ క‌నుక కేఎల్ రాహుల్ గ‌నుక ఫిట్‌నెస్ సాధిస్తే అత‌డిని నేరుగా తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం ఖాయమ‌ని అప్పుడు సంజు శాంస‌న్‌ను ప్ర‌పంచ‌క‌ప్‌లో చూసే అవ‌కాశం లేద‌ని ఆకాశ్ చోప్రా తెలిపాడు. త‌న యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ చోప్రా ఈ విష‌యాన్ని చెప్పాడు.

అదే స‌మ‌యంలో సంజుకు టీమ్ఇండియాలో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. అత‌డి వ‌య‌సు ఇంకా 28 ఏళ్లు మాత్ర‌మే అని, 2024లో వెస్టిండీస్‌, అమెరికా ఆతిథ్యం ఇవ్వ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో అత‌డికి చోటు ద‌క్కే అవ‌కాశం ఉంద‌న్నాడు.

Dinesh karthik : జైలర్ పై దినేశ్ కార్తీక్.. సూప‌ర్‌స్టార్ ఈజ్ ది బెస్ట్ అంటూనే..

ఇదిలా ఉంటే.. ఈ నెల 30 నుంచి ఆసియా క‌ప్ ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌, శ్రీలంక లు ఆతిథ్యం ఇవ్వ‌నున్న ఈ టోర్నీ వ‌న్డే ఫార్మాట్‌లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే దాదాపుగా ఈ టోర్నీలో పాల్గొనే జ‌ట్లు త‌మ ఆట‌గాళ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించ‌గా భార‌త్ త్వ‌ర‌లోనే ప్లేయ‌ర్ల వివ‌రాల‌ను తెలియ‌జేయ‌నుంది. ఈ నెల 18న కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌ను ఎదుర్కొనున్నాడు. ఆ త‌రువాత‌నే అత‌డి పై ఓ నిర్ణ‌యానికి రానున్న‌ట్లు తెలుస్తోంది.

Rohit Sharma : రోహిత్ శ‌ర్మ కారు నంబ‌ర్‌కి అత‌డి రికార్డుకు ఉన్న సంబంధం తెలుసా..?