ICC World Cup 2023: వారెవ్వా.. ఆ జట్టు ఏం ఆడింది.. వన్డే ప్రపంచ కప్-2023కి అర్హత సాధించిన చివరి జట్టు ఇదే..

సూపర్ సిక్స్ లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఆడాయి.

ICC World Cup 2023: వారెవ్వా.. ఆ జట్టు ఏం ఆడింది.. వన్డే ప్రపంచ కప్-2023కి అర్హత సాధించిన చివరి జట్టు ఇదే..

Netherlands (@ICC)

Updated On : July 6, 2023 / 8:40 PM IST

ICC World Cup 2023 – Netherlands: ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సూపర్ సిక్స్ మ్యాచులో స్కాట్లాండ్‌(Scotland )ను నెదర్లాండ్స్ ఓడించింది. దీంతో వన్డే ప్రపంచ కప్-2023కు అర్హత సాధించింది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు ఈ మెగా టోర్నీ భారత్ (India) లో జ‌ర‌గ‌నున్న విషయం తెలిసిందే. దీంతో ఆ సమయంలో ఫ్లైట్ ఎక్కి భారత్ కు రానుంది నెదర్లాండ్స్.

ఇంతకు ముందే వన్డే ప్రపంచ కప్-2023కు భారత్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా అర్హత సాధించాయి. ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ సూపర్ సిక్స్ మ్యాచులో టాప్ లో నిలిచిన శ్రీలంక ఇటీవలే వన్డే ప్రపంచ కప్-2023కు అర్హత సాధించింది.

ఇవాళ స్కాట్లాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లకు 277/9 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ బ్యాటర్ బాస్ డి లీడే చెలరేగి ఆడి 92 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఓపెనర్ విక్రమ్ సింగ్ కూడా 40 పరుగులతో రాణించడంతో నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

దీంతో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్ పై గెలిచింది. ప్రపంచ కప్ కు అర్హత సాధించిన 10వ జట్టుగా నిలిచింది. అంటే, వన్డే ప్రపంచ కప్-2023కి అర్హత సాధించిన చివరి జట్టు ఇదే. స్కాట్లాండ్ కన్నా నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో నెదర్లాండ్స్ ప్రపంచ కప్ పోరులో నిలిచింది.

సూపర్ సిక్స్ లో శ్రీలంక, జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్, వెస్టిండీస్, ఒమన్ ఆడాయి. శ్రీలంక, నెదర్లాండ్స్ పాయింట్ల టేబుల్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచి అర్హత సాధించాయి. వెస్టిండీస్ సహా మిగతా జట్లు ప్రపంచ కప్-2023కి దూరమయ్యాయి.

సూపర్ సిక్స్ పాయింట్ల టేబుల్

West Indies: ఆ వన్డే ప్రపంచకప్‌ను భారత్ ఏదో లక్కీగా గెలుచుకుంది.. లేదంటే..: వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సంచలన వ్యాఖ్యలు