నిజంగా నువ్వు గొప్పోడివి సామీ..! బ్యాటింగ్‌కు రావాల్సిన టైంలో నిద్రపోయిన పాక్ క్రికెటర్.. షాకిచ్చిన అంపైర్

పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో అతిపెద్ద ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘ప్రెసిడెంట్స్ ట్రోఫీ’లో అరుదైన ఘటన చోటు చేసుకుంది.

నిజంగా నువ్వు గొప్పోడివి సామీ..! బ్యాటింగ్‌కు రావాల్సిన టైంలో నిద్రపోయిన పాక్ క్రికెటర్.. షాకిచ్చిన అంపైర్

Saud Shakeel

Updated On : March 7, 2025 / 9:38 AM IST

Saud Shakeel: పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ చేసినపనికి ఆ జట్టు సభ్యుల ఫ్యూజ్ లు ఎగిరిపోయాయి. బ్యాటింగ్ కు రావాల్సిన సమయంలో అతను మాత్రం హాయిగా డ్రెస్సింగ్ రూంలో నిద్రపోయాడు. చివరికి నిద్రనుంచి లేచి బ్యాటింగ్ చేద్దామని క్రీజులోకి వస్తుండగా అంపైర్ షాకిచ్చాడు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాక్ అభిమానులు షకీల్ పై మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Champions Trophy: అయ్యో.. ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది.. ఓడిపోతామేమో.. ఫ్యాన్స్‌లో ఫోబియా ఎందుకంటే?

పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో అతిపెద్ద ఫస్ట్ క్లాస్ టోర్నీ ‘ప్రెసిడెంట్స్ ట్రోఫీ’లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్బీపీ), పాకిస్థాన్ టెలివిజన్ (పీటీవీ) జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. రంజాన్ మాసం కావడంతో రాత్రి 8.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 గంటల వరకు మ్యాచ్ నిర్వహించారు. ఎస్బీపీ జట్టు బ్యాటింగ్ చేస్తుంది. ఒక వికెట్ కోల్పోయి 128 పరుగుల వద్ద ఉన్న సమయంలో పీటీవీ బౌలర్ షహజాద్ అద్భుత బౌలింగ్ తో వరుసగా రెండు వికెట్లు తీశాడు. మూడో వికెట్ పడగానే సౌద్ షకీల్ బ్యాటింగ్ కు రావాల్సి ఉంది. అయితే, అతను అదే సమయంలో డ్రెస్సింగ్ రూంలో నిద్రలో ఉన్నాడు. బ్యాటింగ్ కు సిద్ధంగా లేని అతను నిద్రలో నుంచి లేచి హడావిడిగా క్రీజులోకి వచ్చాడు. అయితే, అంపైర్ మాత్రం సౌద్ షకీల్ కు షాకిచ్చాడు.

Also Read: IND vs NZ : ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో భార‌త్ వ‌ర్సెస్‌ న్యూజిలాండ్ హెడ్-టు-హెడ్ రికార్డ్స్‌..

సౌద్ షకీల్ క్రీజులోకి హడావుడిగా వచ్చాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. నిబంధనల ప్రకారం కొత్త బ్యాటర్ మూడు నిమిషాల్లోగా గార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. సౌద్ షకీల్ ఆలస్యం చేశాడంటూ పీటీవీ కెప్టెన్ అమద్ బట్ అప్పీల్ చేశాడు. దీంతో అంపైర్లు చర్చించి షకీల్ ను టైమ్డ్ అవుట్ గా ప్రకటించారు. దీంతో అతను నిరాశగా మైదానం వీడి వెళ్లిపోయాడు. సౌద్ షకీల్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలోనూ పాకిస్థాన్ జట్టు తరపున బరిలోకి దిగాడు. అయితే, ప్రస్తుతం సౌద్ షకీల్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో పాకిస్థాన్ అభిమానులు షకీల్ పై మండిపడుతున్నారు. అయితే, ప్రపంచ క్రికెట్ లో ఈ విధంగా ఔటైన్ ఏడో బ్యాటర్ గా.. పాక్ చరిత్రలో మొట్టమొదటి ఆటగాడిగా షకీల్ పేరిట రికార్డు నమోదైంది.