Champions Trophy: అయ్యో.. ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది.. ఓడిపోతామేమో.. ఫ్యాన్స్‌లో ఫోబియా ఎందుకంటే?

ఆదివారం మ్యాచ్‌ అంటే ఫ్యాన్స్‌ ఎందుకు భయపడుతున్నారు?

Champions Trophy: అయ్యో.. ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది.. ఓడిపోతామేమో.. ఫ్యాన్స్‌లో ఫోబియా ఎందుకంటే?

PC: ANI

Updated On : March 6, 2025 / 10:15 PM IST

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 ఫైనల్‌ మ్యాచ్‌ ఇండియా, న్యూజిలాండ్ మధ్య దుబాయ్ వేదికగా ఆదివారం రోజున జరుగుతుంది. ఈ రెండు జట్లు 25 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తలపడబోతున్నాయి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ జట్టు.. భారత జట్టును నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది.

ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ గంగూలీ 117 పరుగులు చేయగా న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ కైర్న్స్ 102 పరుగులు చేశాడు. 25 ఏళ్ల నాటి ఓటమికి ప్రతీకారం భారత్ జట్టు తీసుకోవాలని ప్రతి అభిమాని బలంగా కోరుకుంటున్నాడు. కానీ, ఆదివారం అనే ఫోబియా క్రికెట్ ఫ్యాన్స్ కి అంటుకుంది. అదేంటంటే..

టీమిండియా అభిమానులను ఆదివారం భయపెడుతోంది ఎందుకంటే.. ఇప్పటివరకు ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్ మ్యాచ్ లలో భారత్ గెలిచింది.1983 WC (శనివారం), 2002 CT (సోమవారం), 2007 T20 WC (సోమవారం), 2011 ODI WC (శనివారం), 2013 CT (సోమవారం), 2024 T20 WC (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది.

2000 CT, 2014 T20 WC, 2017 CT, 2003 ODI WC, 2023 ODI WC ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది.(CT-ఛాంపియన్స్ ట్రోఫీ, ODI WC- వన్డే వరల్డ్ కప్, T20 WC- T20 వరల్డ్ కప్).

దీంతో భారత్ అభిమానులు ఆదివారం ఇండియా, న్యూజిలాండ్ ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ పై కొంతమంది భయం పెట్టుకున్నారు. అలాగే ప్రతి సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదని, మొన్న జరిగిన మ్యాచ్ లో భారత్ పై పాకిస్థాన్ గెలుస్తుందని జోస్యం చెప్పిన ఐఐటీ బాబా లాగే ఇది కూడా జరగదని సోషల్ మీడియాలో కొట్టి పారేస్తున్నారు అభిమానులు.

టీమిండియాలో ప్రతి ప్లేయర్ ఫామ్ లో ఉన్నారని, బౌలింగ్ అలాగే బ్యాటింగ్ విభాగాల్లో స్ట్రాంగ్ ఉన్నారని, టాప్‌ బ్యాటర్లు త్వరగా ఔట్ అయినా మిడిలార్డర్ ప్లేయర్స్ నిలబడి మ్యాచ్‌ను గెలిపిస్తున్నారని అభిమానులు సోషల్ మీడియాలో అంటున్నారు. ఇంకొంతమంది దుబాయ్‌లో టీమిండియా అన్ని మ్యాచులను పకడ్బందీగా ఆడుతూ, స్ట్రాటజీలను అమలుపరుస్తూ సునాయాసంగా గెలుస్తుందని ఇలాంటి సమయంలో సండే సెంటిమెంట్ పనిచేయదని మరికొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు.