IND vs PAK : భార‌త్‌కు పాక్ పేస‌ర్ వార్నింగ్‌.. మ‌ళ్లీ అదే రిపీట్ అవుతుంది.. కాస్కోండి..

భార‌త్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్ పేస‌ర్ హారిస్ ర‌వూఫ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

IND vs PAK : భార‌త్‌కు పాక్ పేస‌ర్ వార్నింగ్‌.. మ‌ళ్లీ అదే రిపీట్ అవుతుంది.. కాస్కోండి..

Pakistan pacer Haris Rauf key comments ahead of IND vs PAK Champions Trophy clash

Updated On : February 22, 2025 / 3:46 PM IST

యావ‌త్ క్రికెట్ ప్ర‌పంచం మొత్తం భార‌త్‌, పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్‌లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో త‌మ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పై భార‌త్ విజ‌యం సాధించ‌గా, కివీస్ పై పాక్ ఓడిపోయింది. పాక్‌తో మ్యాచ్‌లో గెలిచి సెమీస్ కు మ‌రింత చేరువ కావాల‌ని భార‌త్ భావిస్తోంది. పాక్ కు ఈ మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోతే టోర్నీ నుంచి పాక్ నిష్ర్క‌మిస్తోంది.

ఈ క్ర‌మంలో పాక్ పేస‌ర్ హారిస్ ర‌వూఫ్ టీమ్ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. గ‌తంలో దుబాయ్ వేదిక‌గానే భార‌త్‌ను ఓడించామ‌ని, మ‌రోసారి అదే రిపీట్ అవుతుంద‌న్నాడు.

Mohammed Shami : ఛాంపియ‌న్స్ ట్రోఫీకి ముందు 9 కిలోల బ‌రువు త‌గ్గిన ష‌మీ.. ఒక్క పూట భోజనం.. ఫిట్‌నెస్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

భార‌త్‌తో మ్యాచ్‌కు సంబంధించి మాపై ఎలాంటి ఒత్తిడి లేదు. ఇది మంచి మ్యాచ్ అవుతుంది. దుబాయ్‌లో పాక్‌కు మెరుగైన రికార్డు ఉంది. 2021లో దుబాయ్ లోని మైదానంలో ఆడిన టీ20 ప్రపంచ కప్ లో, ఆ తర్వాత 2022లో జరిగిన ఆసియా కప్ లో నూ భార‌త్‌ను ఓడించాం. ఈ సారి కూడా ఓడిస్తాం అని ర‌వూఫ్ అన్నాడు.

దుబాయ్ పిచ్‌ను ప‌రిశీలించిన త‌రువాత‌నే త‌మ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేసుకుంటామ‌ని చెప్పాడు. హారిస్ ర‌వూఫ్ చేసిన ఈ వ్యాఖ్య‌లు వైర‌ల్‌గా మార‌గా.. భార‌త అభిమానులు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్నారు. ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై భార‌త్‌కు మంచి రికార్డు ఉంద‌నే విష‌యాన్ని గుర్తు చేస్తున్నారు.

IML 2025 : మ‌ళ్లీ బ‌రిలోకి స‌చిన్‌, యువ‌రాజ్‌, గేల్‌, లారా.. నేటి నుంచే ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్.. మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చంటే?

కివీస్‌తో మ్యాచ్‌లో క‌నీసం పోటీ ఇవ్వ‌లేద‌ని, భార‌త్ ను అడ్డుకునే స‌త్తా ఉందా అని ప్ర‌శ్నిస్తున్నారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2023లో కోహ్లీ అత‌డి బౌలింగ్‌లో కొట్టిన రెండు వ‌రుస సిక్స‌ర్ల‌ను అత‌డు అప్పుడే మ‌రిచిపోయాడా కామెంట్లు చేస్తున్నారు.