మూడు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై భారత్ ఓటమి

  • Published By: vamsi ,Published On : November 21, 2019 / 05:41 AM IST
మూడు పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై భారత్ ఓటమి

Updated On : November 21, 2019 / 5:41 AM IST

ఆసియా ఎమర్జింగ్‌ కప్‌ అండర్‌ 23 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత్ పోరాటం ముగిసింది. దాయాది పాకిస్తాన్ చేతిలో భారత్ కేవలం మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. టైటిల్‌ ఫేవరెట్‌ అనుకున్న భారత జట్టు అనూహ్యంగా సెమీఫైనల్లో ఓడిపోయింది.

పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడిన టీమిండియా ఫీల్డింగ్‌కు దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆటగాళ్లు నిర్ణీత 50ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 267పరగులు చేసింది. 

తర్వాత 268 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 8వికెట్లు నష్టపోయి 264పరుగులు మాత్రమే చేసింది. చివరి ఓవర్లో పాకిస్తాన్ బౌలర్‌ అమాద్‌ బట్‌ వేసిన బంతులను ఎదుర్కోవడంతో భారత్ విఫలం అయ్యింది. చివరి ఓవర్లో 8పరుగులు అవసరం ఉండగా.. భారత్‌ వికెట్‌ కోల్పోవడంతోపాటు కేవలం నాలుగు పరుగులే చేసి ఓటమి చవిచూసింది.

భారత ఇన్నింగ్స్‌లో శరత్‌ (47; 6 ఫోర్లు, సిక్స్‌), సనీ్వర్‌ సింగ్‌ (76; 5 ఫోర్లు, సిక్స్‌), అర్మాన్‌ జాఫర్‌ (46; 3 ఫోర్లు, సిక్స్‌) రాణించినా కీలకదశలో అవుట్‌ కావడం దెబ్బ తీసింది. అంతకుముందు పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 267 పరుగులు సాధించింది.