Premier Handball League: తెలుగు టాలన్స్ ఘన విజయం
తెలుగు టాలన్స్ మొత్తం 48 సార్లు గోల్ ప్రయత్నం చేసింది. అందులో 28 గోల్స్ సాధించింది.
![Premier Handball League: తెలుగు టాలన్స్ ఘన విజయం Premier Handball League: తెలుగు టాలన్స్ ఘన విజయం](https://10tv.in/wp-content/uploads/2023/06/New-Project-5-5.jpg)
Premier Handball League
Premier Handball League -Rajasthan: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (PHL-2023) తొలి సీజన్లో తెలుగు టాలన్స్ (Telugu Talons) మూడో విజయం నమోదు చేసింది. రాజస్థాన్ జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన గ్రూప్ దశ జరిగింది.
![Premier Handball League](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/6dcf5df2-8d2c-4e92-b1d3-b2e5706e0126.jpg)
Premier Handball League
రాజస్థాన్ పాట్రియాట్స్పై 28-24 తేడాతో తెలుగు టాలన్స్ ఘన విజయం సాధించింది. తెలుగు టాలన్స్ మొత్తం 48 సార్లు గోల్ ప్రయత్నం చేసింది. అందులో 28 గోల్స్ సాధించింది. గ్రూప్ దశలో 5 మ్యాచులు ఆడిన తెలుగు టాలన్స్కు ఇది మూడో విజయం. తాజాగా మ్యాచులో 14 నిమిషాల వద్ద 6-6తో టాలన్స్, పాట్రియాట్స్ సమవుజ్జీలుగా నిలిచాయి.
![Premier Handball League](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/cc116a92-3afc-4646-b656-7907a615ef95-1.jpg)
Premier Handball League
అనంతరం రాజస్థాన్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ సమయంలో 9-7తో రెండు పాయింట్ల ముందంజలో నిలిచింది రాజస్థాన్. తెలుగు టాలన్స్ చివరకు పుంజుకున్నా విరామ సమయానికి 14-13తో రాజస్థాన్ ఆధిక్యంలో ఉంది. ద్వితీయార్థంలో తెలుగు అద్భుతంగా రాణించింది. నాలుగు గోల్స్ తేడాతో తెలుగు టాలన్స్ విజయం సాధించింది.
![Premier Handball League](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/87f2eaa9-2ad8-4298-b0c5-a6e6f8aa8279.jpg)
Premier Handball League
Premier Handball League
![Premier Handball League](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/2c174ab0-a9c7-4393-adb7-80f8e8289b33.jpg)
Premier Handball League