Pro Kabaddi League: క్రీడాభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ సందడి చోయబోతున్న ప్రో కబడ్డీ.. తొలి కూత ఎప్పుడో తెలుసా?

బెంగళూరు, పూణె, హైదరాబాద్ కేంద్రంగా ఈ లీగ్ కొనసాగనుంది. డిసెంబర్ వరకు కొనసాగే ఈ లీగ్‭కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొవిడ్ కారణంగా 8వ లీగ్‭ను అభిమానులు లేకుండానే కొనసాగించారు. తాజాగా నిర్వహించే లీగ్‭లో అన్ని జాగ్రత్తల నడుమ క్రీడాభిమానుల ప్రత్యక్ష కోలాహాలం నడుమే నిర్వహించనున్నట్లు ఈ లీగ్ సీఈవో అనుపమ్ గోస్వామి తెలిపారు.

Pro Kabaddi League: క్రీడాభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ సందడి చోయబోతున్న ప్రో కబడ్డీ.. తొలి కూత ఎప్పుడో తెలుసా?

Pro Kabaddi League to welcome back fans as new season begins on October 7

Updated On : August 26, 2022 / 4:38 PM IST

Pro Kabaddi League: క్రీడా అభిమానుల్ని ఉర్రూతలూగించేందుకు ప్రొ కబడ్డీ లీగ్ మళ్లీ వచ్చేసింది. దేశంలో ఐపీఎల్‌ తర్వాత అంతటి రేంజ్‌ క్రేజ్‌ ప్రో కబడ్డికి సొంతం. మన దేశ గ్రామీణ క్రీడ అయిన కబడ్డీ ఈ లీగ్‌ ద్వారా గ్లోబల్ లెవల్లో సత్తా చాటింది. కబడ్డి ప్లేయర్స్‌ కూడా వేలు, లక్షలు దాటి కోట్లు అందుకున్నారంటే అది ప్రో కబడ్డి లీగ్ ఘనతే. ఈ కబడ్డీ లీగ్‌ ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకుంది. 9వ సీజన్‌‭కు సర్వం సిద్దమవుతోంది. ‘‘కబడ్డీ.. కబడ్డీ..’’ అంటూ అక్టోబర్ 7న తొలి కూత వినిపించనుంది. దీనికి సంబంధించిన వేలం ప్రక్రియ ఆగస్టు 5, 6వ తేదీల్లో ముగిసింది.

బెంగళూరు, పూణె, హైదరాబాద్ కేంద్రంగా ఈ లీగ్ కొనసాగనుంది. డిసెంబర్ వరకు కొనసాగే ఈ లీగ్‭కు పెద్ద ఎత్తున క్రీడాభిమానులు హాజరవుతారని, అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొవిడ్ కారణంగా 8వ లీగ్‭ను అభిమానులు లేకుండానే కొనసాగించారు. తాజాగా నిర్వహించే లీగ్‭లో అన్ని జాగ్రత్తల నడుమ క్రీడాభిమానుల ప్రత్యక్ష కోలాహాలం నడుమే నిర్వహించనున్నట్లు ఈ లీగ్ సీఈవో అనుపమ్ గోస్వామి తెలిపారు.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం