వయస్సు దాచే ప్లేయర్లను నిషేదించాల్సిందే..!!

'వయస్సు దాచి టోర్నమెంట్ లలో ఆడాలని చూస్తోన్న వారిని నిషేదించాల్సి ఉంది.

వయస్సు దాచే ప్లేయర్లను నిషేదించాల్సిందే..!!

Updated On : April 2, 2019 / 1:39 PM IST

‘వయస్సు దాచి టోర్నమెంట్ లలో ఆడాలని చూస్తోన్న వారిని నిషేదించాల్సి ఉంది.

గేమ్‌లో గెలిచేందుకు తొక్కే అడ్డదారుల్లో వయస్సు దాచడం ఒకటి. అండర్ 19, అండర్ 17, అండర్ 15ఇలా టోర్నమెంట్‌కు అనుగుణంగా వయస్సును ప్రకటించకుండా తోటి ప్లేయర్ల కంటే పెద్దవాళ్లు అయినా టోర్నీలలో ఆడేందుకు సిద్ధమైపోతుంటారు. ఇలాంటి వాళ్లందర్నీ నిషేదించాలని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు భారత బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ సూచిస్తున్నారు. 
Read Also : IPL 2019: రికార్డుకు 63 పరుగుల దూరంలో కోహ్లీ

‘వయస్సు దాచి టోర్నమెంట్ లలో ఆడాలని చూస్తోన్న వారిని నిషేదించాల్సి ఉంది. ఇలాంటి పద్ధతికి స్వస్తి చెప్తేనే మిగిలిన వారికి న్యాయం చేయగలం. గట్టి ఉదాహరణలు లేకుండా వారి వయస్సు నిర్దారించడం సరైంది కాదు’ అని గోపిచంద్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో (బీసీసీఐ)బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇన్ ఇండియా, టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(టీటీఎఫ్ఐ)లలో ఆడుతున్న ప్లేయర్ల గురించి ఆయన ఈ విధంగా తెలిపారు. 

‘ఇలా వయస్సును దాచి టోర్నీలలో ఆడితే.. 2-3ఏళ్ల నిషేదాన్ని విధిస్తున్నారు. ఇది సరైంది కాదు. దాని వల్ల వారి టాలెంట్ పూర్తిగా నాశనమైపోతుంది. ఒక వేళ అండర్ 15, అండర్ 17, అండర్ 19 కేటగిరీల్లో ఆడుతూ వయస్సు దాచారని నిర్దారణ అయితే వారిని పూర్తిగా సీనియర్ కేటగిరీల్లో ఆడుకొమ్మని చెప్పాలి. ఈ విషయాన్ని ఎన్నికల తర్వాత జూనియర్.. సీనియర్ సెలక్షన్ కమిటీలకు పంపుతాం’ అని గోపిచంద్ విశ్వాసం వ్యక్తం చేశారు. 
Read Also : వచ్చాడు.. వెళుతున్నాడు: మలింగకు ఐపీఎల్ నుంచి బ్రేక్