తేజస్ యుద్ధ విమానంలో పీవి సింధు

తెలుగు తేజం పీవి సింధుకు అరుదైన గౌరవం దక్కింది. ఉమెన్స్ డేలో భాగంగా ఏరో ఇండియా షోను నిర్వహించనుంది. ఇందులో భాగంగానే పీవి సింధు కోరిక మేరకు ఏరో ఇండియా ఈ అవకాశాన్ని కల్పించింది. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ తేజస్ యుద్ధ విమానంలో చక్కర్లు కొట్టింది. ఎక్కే ముందు చేతులు ఊపుతూ అందరికీ అభివాదం తెలిపింది.
Read Also: భారత్-పాక్ మ్యాచ్ వాళ్ల ఇష్టమే: కపిల్ దేవ్
బెంగళూరు వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌లో సింధూ గ్రీన్ కలర్ యూనిఫామ్‌లో కన్పించింది. తాడుతో చేసిన నిచ్చెన ఎక్కి ఎయిర్‌క్రాఫ్ట్‌లో కో పైలట్‌గా కూర్చొంది. ప్రస్తుతం పీవి సింధు బర్మింగ్‌హామ్ వేదికగా మార్చి 6 నుంచి మార్చి 10వరకూ జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్ ఈవెంట్ కు సిద్ధమవుతోంది.
Read Also: భారత్ Vs పాక్ మ్యాచ్: బీసీసీఐ చెప్పిందే చేస్తామంటోన్న కోహ్లీ