Vedaant: స్మిమ్మింగ్‌లో మాధవన్ కొడుకు మరో రికార్డ్

సినీ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచి రికార్డ్ సాధించారు. 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 1500మీ ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

Vedaant: స్మిమ్మింగ్‌లో మాధవన్ కొడుకు మరో రికార్డ్

Vedanta Swimming

Updated On : July 18, 2022 / 9:47 AM IST

 

Vedaant: సినీ నటుడు మాధవన్ కొడుకు వేదాంత్ మరోసారి వార్తల్లో నిలిచారు. నేషనల్ స్విమ్మింగ్ పోటీల్లో విజేతగా నిలిచి రికార్డ్ సాధించారు. 48వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని 1500మీ ఫ్రీస్టైల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

“ఎప్పుడూ ఎప్పటికీ జరగదని అనొద్దు. 1500మీటర్ల నేషనల్ జూనియర్ రికార్డ్ బ్రేక్ చేశాం” అంటూ వేదాంత్ స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు. కామెంటేటర్ మాట్లాడుతూ.. 16నిమిషాల పాటు 780మీటర్ల అద్వైత్ మార్క్ రికార్డ్ బ్రేక్ చేశాడు. ఇంత అద్భుతంగా ఘనత నమోదు చేస్తాడని భావించలేదు.

ఏప్రిల్‌లో, కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్‌లో పురుషుల 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో వేదాంత్ స్వర్ణ పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. వేదాంత్ పతకాన్ని గెలుచుకున్న క్లిప్‌ను షేర్ చేస్తూ.. మాధవన్ ఇలా పంచుకున్నారు, “ఈ రోజు విజయ పరంపర కొనసాగుతుంది” అంటూ క్యాప్షన్ పెట్టి పోస్టు చేశారు.

Read Also : మాధవన్ గెటప్ చూసి ఆశ్చర్యపోయిన సూర్య.. వైరల్ అవుతున్న వీడియో..

ఇదిలా ఉంటే, మాధవన్ ఇటీవల ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’లో నటించారు. మాధవన్ స్వయంగా దర్శకత్వం వహించిన ప్రాజెక్ట్ ఇది. శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితంపై తెరకెక్కిన చిత్రం. మాధవన్ దర్శకుడిగా పరిచయం చేస్తూ జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.