Rahul Dravid : ముంబై చేరుకున్న టీమ్ఇండియా.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వాంఖ‌డే స్టేడియానికి వెళ్లిన ద్ర‌విడ్‌..!

Team India Head Coach Rahul Dravid : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది.

Rahul Dravid : ముంబై చేరుకున్న టీమ్ఇండియా.. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా వాంఖ‌డే స్టేడియానికి వెళ్లిన ద్ర‌విడ్‌..!

Indian Players arrive mumbai

Team India Head Coach Rahul Dravid : స్వ‌దేశంలో జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో భార‌త జ‌ట్టు అద‌ర‌గొడుతోంది. లీగ్ స్టేజీలో ఆడిన తొమ్మిది మ్యాచుల్లోనూ విజ‌యాలు సాధించింది. ఓట‌మే ఎగుర‌ని జ‌ట్టుగా సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్ ఫైన‌ల్‌లో న్యూజిలాండ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఈ మ్యాచ్ న‌వంబ‌ర్ 15న ముంబైలోని వాంఖ‌డే మైదానంలో జ‌ర‌గ‌నుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా ఆట‌గాళ్లు బెంగ‌ళూరు నుంచి బ‌య‌లు దేరి సోమ‌వారం సాయంత్రం (నవంబ‌ర్ 13న) ముంబైకి చేరుకున్నారు.

ప్ర‌త్యేక విమానంలో ముంబైకి చేరుకున్న రోహిత్ సేన‌కు అభిమానులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అదే స‌మ‌యంలో భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ మాత్రం జ‌ట్టుతో కాకుండా కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ముంబైకి చేరుకున్నాడు. మంగ‌ళ‌వారం టీమ్ఇండియా ప్రాక్టీస్ మొద‌లుపెట్ట‌నుంది. సెమీస్‌లో విజ‌యం సాధించి ప్ర‌పంచ‌క‌ప్‌ను ముద్దాడాల‌న్న క‌ల‌కు మ‌రింత ద‌గ్గ‌ర కావాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది.

Team India : క్రికెట్ ఫ్యాన్స్‌కు శుభ‌వార్త‌.. మార్చి వ‌ర‌కు టీమ్ఇండియా మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు.. ఎలాగో తెలుసా..?

వాంఖ‌డేకు ద్ర‌విడ్‌..

టీమ్ఇండియా ఆట‌గాళ్లు ముంబైకి చేరుకున్న అనంత‌రం హోట‌ల్ గ‌దుల‌కే ప‌రిమితం కాగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాత్రం స‌హాయ‌క సిబ్బందితో క‌లిసి వాంఖ‌డే స్టేడియానికి వెళ్లాడు. స్టేడియంలోని పిచ్‌ను బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్‌, బౌలింగ్ కోచ్ ప‌రాస్ మాంబ్రేతో క‌లిసి ప‌రిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Virat Kohli : త‌న‌ను ఔట్ చేసిన ఆట‌గాడికి గిఫ్ట్ ఇచ్చిన కోహ్లీ.. ఏంటో తెలుసా..? వీడియో వైర‌ల్‌

ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా ఆడే మ్యాచుల‌కు ముందు స‌ద‌రు స్టేడియాల్లోకి వెళ్లి పిచ్‌ల‌ను ప‌రిశీలించ‌డం ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా హెడ్ కోచ్‌కు ఒక ఆన‌వాయితీగా మారింది. అంత‌క‌ముందు సౌతాఫ్రికాతో మ్యాచ్ ముందు కూడా కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్‌కు ద్ర‌విడ్ వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామం..

ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ముంబైలోని వాంఖ‌డే స్టేడియంలో నాలుగు మ్యాచులు జ‌రిగాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌కు స్వ‌ర్గ‌ధామంగా మారింది. నాలుగు మ్యాచుల్లోనూ భారీ స్కోర్లు న‌మోదు అయ్యాయి. ఈ క్ర‌మంలో భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ భారీ స్కోర్ న‌మోదు అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

Pakistan : ప్ర‌పంచ‌క‌ప్‌లో దారుణ ప్ర‌ద‌ర్శ‌న‌.. పాక్ బౌలింగ్ కోచ్‌ మోర్కెల్ రాజీనామా