ఒక్క షాట్‌తో రాజస్థాన్ అభిమాని చెన్నైకి వచ్చేశాడు

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్‌దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది.

  • Published By: veegamteam ,Published On : April 12, 2019 / 09:39 AM IST
ఒక్క షాట్‌తో రాజస్థాన్ అభిమాని చెన్నైకి వచ్చేశాడు

Updated On : April 12, 2019 / 9:39 AM IST

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్‌దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది.

రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్‌దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది. ఈ అద్భుతమైన విజయానికి స్టేడియంలో ఉన్న రాజస్థాన్ అభిమాని ఒకరు చెన్నై సూపర్ కింగ్స్‌కు అభిమానిగా మారిపోయాడు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది. 

గురువారం జరిగిన మ్యాచ్‌లో చేధనకు దిగిన చెన్నైకు విజయానికి ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉంది. కానీ, అప్పటికీ 4పరుగులు చేయాల్సి ఉంది. ఆ సమయంలో స్టోక్స్ శాంతర్‌కు వైడ్ వేయడంతో మరో 3పరుగులు.. ఇంకా ఒక్క బంతి.. స్టేడియంలో ప్రేక్షకులతో పాటు.. టీవీల ముందు కూర్చున్నవారికీ ఒకటే టెన్షన్. మరో బంతిని సంధించిన స్టోక్స్‌కు తిరుగులేని సమాధానం ఇచ్చాడు శాంతర్. సిక్స్ బాది విన్నింగ్స్ షాట్‌తో అద్భుతహ అనిపించాడు. అంతే స్టేడియంలో అభిమానులంతా రాజస్థాన్..రాజస్థాన్ అని అరవడం మానేసి ధోనీ.. ధోనీ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. శాంతర్‌కు వేసిన బంతిని అంపైర్ వైడ్‌గా ప్రకటించాడు. 
Read Also : గంగూలీకి ఢిల్లీ మీద గట్టి నమ్మకమే ఉంది: పాంటింగ్

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 151పరుగులు చేసి చెన్నైకు చక్కటి టార్గెట్‌ను అందించింది. అంతే ధీటుగా బౌలింగ్ లోనూ మంచి ప్రణాళికలు చేసింది రాజస్థాన్ రాయల్స్. ఆ దెబ్బకు చెన్నై బ్యాట్స్‌మెన్ వికెట్లు టపాటపా పడిపోయాయి. ఈ క్రమంలో ధోనీ, రాయుడు క్రీజులో పాతుకుపోయి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మ్యాచ్ ముగిస్తారనుకుంటున్న సమయంలో ధోనీ వికెట్ చేజార్చుకుంది చెన్నై. 

ఇంకా 3బంతులు ఉండగా ధోనీ(58) వికెట్ కోల్పోవడంతో చెన్నైకు పరాజయం తప్పదని భావించారంతా. ఆ క్షణంలో జరిగిన అద్భుతం కారణంగా శాంతర్.. మ్యాచ్ ను గెలిపించేశాడు. 2పరుగులు 2సార్లు చేయడంతో 148 పరుగులకు చెన్నై చేరింది. ఇంకా విజయానికి 4పరుగుల దూరం.. చేతిలో ఉంది 1 బంతి మాత్రమే. ఆ క్షణంలో జరిగిన అద్భుతానికి స్టేడియంలో అభిమాని తన జెర్సీనే మార్చేసి చెన్నైకి మారిపోయాడు. 

Read Also : మొబైల్, వెబ్ వెర్షన్ : ‘Jio News’ యాప్ వచ్చేసింది