Rajiv Gandhi Khel Ratna: మేజర్ ధ్యాన్ చంద్ మూడు సార్లు ఒలింపిక్ గోల్డ్ విన్నర్ అని మీకు తెలుసా
క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందించే విషయం తెలిసిందే. ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రాజీవ్ ఖేల్ రత్న పేరును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ గా పురస్కారంగా మారుస్తున్నట్లు వెల్లడించారు.

Dhyan Chand
Rajiv Gandhi Khel Ratna: క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చూపెట్టిన వారికి ‘రాజీవ్ ఖేల్ రత్న’ పేరిట అవార్డులు అందించే విషయం తెలిసిందే. ఈ అవార్డు పేరును కేంద్ర ప్రభుత్వం మార్చేసింది. ఈ మేరకు 2021, ఆగస్టు 06వ తేదీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. రాజీవ్ ఖేల్ రత్న పేరును ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ గా పురస్కారంగా మారుస్తున్నట్లు వెల్లడించారు.
ప్రధాని చెప్పిన ధ్యాన్ చంద్ ఎవరు:
ఆల్ టైం గ్రేటెస్ట్ ప్లేయర్ లలో ఒకరు ధ్యాన్ ఛంద్. అలహాబాద్ లోని 1905 ఆగష్టు 29న పుట్టిన రోజును పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించి గౌరవించింది భారత ప్రభుత్వం.
హాకీ ప్రపంచంలో ఇండియా వెలుగొందుతున్న రోజులవి. ధ్యాన్ చంద్ జట్టులో ఉన్నాడు. వరుసగా 1928, 1932, 1936లలో జరిగిన ఒలింపిక్ టోర్నీలో గోల్స్ చేసి మూడు స్వర్ణాలు దక్కించుకున్నారు. అంతకంటే ముందే 1922లో ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయ్యారు. 1926 న్యూజిలాండ్ పర్యటనలో ఆయనకు బాగా పేరొచ్చింది.
1928, 1932 ఒలింపిక్ గేమ్స్ లో ఆడిన తర్వాత 1936వ టోర్నీకి కెప్టెన్ గా ఆడారు ధ్యాన్ చంద్. ఫైనల్ మ్యాచ్ లో జర్మనీతో ఆడి మూడు గోల్స్ చేయడమే కాకుండా ఆ జట్టును 8-1తేడాతో ఓడించగలిగారు.
1932వ సంవత్సరం ఇండియా విక్టోరియస్ వరల్డ్ టూర్ మొత్తంలో 133గోల్స్ చేశారు. ఆయన సూపర్ బాల్ కంట్రోలింగ్ చూసి (ద విజర్డ్) తాంత్రికుడని పిలిచేవారు. ఆయన కెరీర్ లో ఇంటర్నేషనల్ మ్యాచ్ ను 1948లో ఆడారు. అప్పటికే 400కు మించిన అంతర్జాతీయ గోల్స్ సాధించారు. 1956లో ఆర్మీ నుంచి మేజర్ గా రిటైర్ అయ్యారు.
ఈ అవార్డు గెలిస్తే..
ఈ అవార్డు గెలిచిన వారికి ప్రశంసా పత్రంతో పాటు రూ.25లక్షల ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. గతంలో విరాట్ కోహ్లీ, హాకీ లెజెండ్ సర్దార్ సింగ్, సానియా మీర్జా, ఎంఎస్ ధోనీ, విశ్వనాథన్ ఆనంద్, ధన్ రాజ్ పిల్లై, సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజాలు ఈ అవార్డు అందుకున్నారు.