Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్‌పై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్

మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. మిగ్ జామ్ తుపాన్ మంగళవారం తీరాన్ని దాటిని చెన్నై నగరంలో జన జీవనం స్తంభించి పోయిందని రవిచంద్రన్ చెప్పారు....

Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్‌పై  భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంట్

Ravichandran Ashwin

Michaung cyclone : మిగ్ జామ్ తుపాన్ ప్రభావంపై భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. మిగ్ జామ్ తుపాన్ వల్ల తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగర ప్రజలు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని రవిచంద్రన్ పేర్కొన్నారు. మిగ్ జామ్ తుపాన్ మంగళవారం తీరాన్ని దాటిని చెన్నై నగరంలో జన జీవనం స్తంభించి పోయిందని రవిచంద్రన్ చెప్పారు. తమ చెన్నై నగరంలో గత 30 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.

ALSO READ : Cyclone Michaung : తుపాన్ తీరాన్ని దాటినా ఆంధ్రా కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు

చెన్నైలోని గ్రాండ్ మాల్ సమీపంలోని ప్రాంతంలో విద్యుత్ కోతలు ఉన్నాయని ఫిర్యాదు చేసిన మరో చెన్నై నివాసి ఎక్స్ లో పోస్ట్‌ను అశ్విన్ రీట్వీట్ చేశారు. చెన్నై నగరంలో వెల్లువెత్తిన వరదలపై ప్రజలను ఆదుకోవాలని అశ్విన్ కోరారు. వర్షం ఆగిపోయినా ప్రజలు కోలుకోవడానికి సమయం పడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. చెన్నై,చుట్టుపక్కల ప్రాంతాల్లో మిగ్ జామ్ తుపాన్ కారణంగా 12 మంది మరణించారు.

ALSO READ : Aamir Khan : చెన్నై వరదల్లో చిక్కుకున్న ఆమీర్ ఖాన్.. ఫోటోలు వైరల్..

మంగళవారం వరదలు రోడ్లను నదులుగా మార్చాయి. వరదనీటిలో వాహనాలు కొట్టుకుపోయాయి. విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. పరిస్థితి చక్కబడే వరకు ఇంటి నుంచి పని చేయాలని ప్రైవేట్ కార్యాలయాలు తమ ఉద్యోగులను కోరాయి.