Ravichandran Ashwin : అనిల్ కుంబ్లే ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టిన రవిచంద్రన్ అశ్విన్
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు.

Anil Kumble and Ravichandran Ashwin (Google Photo)
Ravichandran Ashwin – Anil Kumble : భారత్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వచ్చే నెలలో స్వదేశంలో వన్డే ప్రపంచ కప్ ఆరంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను టీమిండియా ఆడుతుంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు పూర్తికాగా.. రెండింటిలో భారత్ జట్టు విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. రెండో వన్డేలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బంతితో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీమిండియా మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు. గతంలో ఆసీస్‌పై అనిల్ కుంబ్లే 142 వికెట్లు తీసి ఒకేజట్టుపై అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. తాజాగా అశ్విన్ 144 వికెట్లతో కుంబ్లే రికార్డును అధిగించాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత్ ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.
అశ్విన్, కుంబ్లే తరువాత కపిల్ దేవ్ 141 వికెట్లు (పాకిస్థాన్ పై), కుంబ్లే 135 వికెట్లు (పాకిస్థాన్ పై), కపిల్ దేవ్ 132 వికెట్లు (వెస్టిండీస్‌పై) తీశారు.