Ravindra Jadeja : రైనాను వెనుకేసుకొచ్చాడు.. జడేజాను ఏకిపారేసిన నెటిజన్లు!

రవీంద్ర జడేజా.. మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనాకు మద్దతుగా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఏకిపారేశారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2021లో రైనా కామెంటేటరీలో 'నేను బ్రాహ్మిణ్‌నే' అంటూ కామెంట్‌ చేయడం వివాదాస్పదమైంది.

Ravindra Jadeja : రైనాను వెనుకేసుకొచ్చాడు.. జడేజాను ఏకిపారేసిన నెటిజన్లు!

Ravindra Jadeja For Allegedly Supporting Suresh Raina

Updated On : July 23, 2021 / 3:55 PM IST

Ravindra Jadeja supporting Suresh Raina : టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనాకు మద్దతుగా చేసిన ట్వీట్‌కు నెటిజన్లు ఏకిపారేశారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2021 సమయంలో సురేశ్‌ రైనా కామెంటేటరీ సమయంలో ‘నేను బ్రాహ్మిణ్‌నే’ అంటూ కామెంట్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. రైనా వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైనాకు మద్దతుగా జడేజా కూడా ‘ఐయామ్‌ జడేజా.. రాజ్‌పుత్‌ బాయ్‌ ఫర్‌ఎవర్‌.. #RAJPUTBOY FOREVER. జై హింద్‌’ అలాంటి ట్వీట్ చేశాడు.

అంతే.. 31ఏళ్ల జడేజాను కూడా నెటిజన్లు తప్పుబట్టారు. మీరు ఒక ఆటగాడిగా మిలియన్ల మందికి ఆదర్శం. మీలాంటి వ్యక్తి నుంచి ఇలాంటివి మేం ఊహించలేదు. మతం, కులం, రంగు ముఖ్యం కాదు.. ఒక క్రికెటర్ అయి ఉండి ఇలాంటి కామెంట్లు చేయడం సిగ్గుగా అనిపించడం లేదా?.. మనమంతా ముందు భారతీయులం.. ఆ తర్వాతే ఏదైనా… ఒక రాజ్‌పుత్‌ అని చెప్పుకోవడం మంచి విషయమే.. కానీ, ఇలా వర్గమని చెప్పుకుంటూ ట్వీట్లు చేయడం తప్పు.. అంటూ నెటిజన్లు ఘాటుగానే కామెంట్లు చేశారు.


ప్రస్తుతం రవీంద్ర జడేజా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ఆగస్టు 4 నుంచి జరగనుంది. మాములుగా క్రికెట్‌లో జడేజా ఎప్పుడూ సెంచరీ, అర్థసెంచరీ, మైల్‌స్టోన్‌ సాధించినప్పుడు మైదానంలో తన బ్యాట్‌ను ఖడ్గంలా తిప్పడం అలవాటు. అది స్వతహాగా రాజ్‌పుత్‌ వంశీయులు తమ ఆచారంలో భాగంగా చేస్తుంటారు. జడేజా కూడా తమ సంస్కృతిలో భాగంగానే తమ సంప్రదాయాన్ని గుర్తుచేసుకుంటాడనే విషయం అందరికి తెలిసిందే.