Ravindra Jadeja : రాజ్‌కోట్‌లో రవీంద్ర జడేజా సూపర్ సెంచరీ..
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు.

Jadeja Century
Jadeja Century : రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీ చేశాడు. 198 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేశాడు. టెస్టుల్లో అతడికి ఇది 4 శతకం. రాజ్‌కోట్.. జడేజా హోం గ్రౌండ్ కావడం విశేషం
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. యశస్వి జైస్వాల్(10), శుభ్‌మన్ గిల్(0), రజత్ పటిదార్(5) లు విఫలం కావడంతో 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్ జట్టును కెప్టెన్ రోహిత్ శర్మ(131)తో కలిసి జడేజా ఆదుకున్నాడు. వీరిద్దరు ఆచి తూచి ఆడుతూ మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేయడంలో భారత జట్టు కోలుకుంది.
నాలుగో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. రోహిత్ ఔటైనప్పటికీ అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్(62) తో అండతో జడేజా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. ఈ క్రమంలోనే మూడు అంకెల స్కోరు అందుకున్నాడు.
ప్రస్తుతానికి భారత స్కోరు 315/5. జడేజా (100), కుల్దీప్ యాదవ్ (0) లు క్రీజులో ఉన్నారు.
Test Hundred on his home ground!
A hard fought 4th Test ton and second in Rajkot from @imjadeja ? ?#INDvENG @IDFCFIRSTBank pic.twitter.com/osxLb6gitm
— BCCI (@BCCI) February 15, 2024