Krunal Pandya : ఐపీఎల్ ద్వారా గ‌ట్టిగానే సంపాదించిన కృనాల్ పాండ్యా.. అత‌డి మొత్తం ఆస్తి ఎంతంటే..?

ఆర్‌సీబీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన కృనాల్ పాండ్యా పై ప్ర‌స్తుతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

Krunal Pandya : ఐపీఎల్ ద్వారా గ‌ట్టిగానే సంపాదించిన కృనాల్ పాండ్యా.. అత‌డి మొత్తం ఆస్తి ఎంతంటే..?

Pic credit@ RCB

Updated On : April 28, 2025 / 2:49 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆర్‌సీబీ విజ‌యంలో కృనాల్ పాండ్యా కీల‌క పాత్ర పోషించాడు. 163 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో 47 బంతులు ఎదుర్కొన్న కృనాల్ 5 ఫోర్లు, 4 సిక్స‌ర్ల సాయంతో 73 ప‌రుగులు సాధించాడు. ప్ర‌స్తుతం అత‌డిపై సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

టీమ్ఇండియా త‌రుపున కృనాల్ పాండ్యా 5 వన్డేలు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వ‌న్డేల్లో 130 ప‌రుగులు 2 వికెట్లు, టీ20ల్లో 124 ప‌రుగులు, 15 వికెట్లు సాధించాడు. టీమ్ఇండియా త‌రుపున పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయిన ఈ ఆల్‌రౌండ‌ర్ ఐపీఎల్‌లో మాత్రం అద‌ర‌గొడుతున్నాడు.

IPL 2025 : అశ్విన్‌, మొయిన్ అలీ, ఇంకా.. 2025 సీజ‌న్ త‌రువాత ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే ఆట‌గాళ్లు వీరే..!

ఐపీఎల్ ద్వారా బాగానే సంపాదించాడు..

కృనాల్ పాండ్యా 2016లో ఐపీఎల్‌లో అరంగ్రేటం చేశాడు. ముంబై ఇండియ‌న్స్ అత‌డిని రూ.2 కోట్ల‌కు కొనుగోలు చేసింది. 2017లోనూ అంతే మొత్తం అందుకున్నాడు. ఆ త‌రువాత 2018లో ముంబై ఇండియ‌న్స్ రూ.8.8 కోట్ల చెల్లించి అత‌డిని రిటైన్ చేసుకుంది. 2019, 2020, 2021లోనూ అత‌డు అంతే మొత్తాన్ని అందుకున్నాడు.

అయితే.. 2022లో అత‌డిని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ 8.8 కోట్ల మొత్తానికి వేలంలో సొంతం చేసుకుంది. 2023, 2024లోనూ అత‌డు అంతే మొత్తాన్ని పొందాడు. ఇక 2025 ఐపీఎల్ మెగావేలంలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళ‌రూ జ‌ట్టు రూ.5.75 కోట్ల‌కు ద‌క్కించుకుంది.

SRH : ప్రాక్టీస్ వ‌దిలివేసి మాల్దీవుల‌కు చెక్కేసిన స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌.. కావ్య పాప మాస్ట‌ర్ ప్లాన్ అదేనా?

ప‌లు రిపోర్టుల ప్ర‌కారం కృనాల్ పాండ్యా నిక‌ర ఆస‌క్తి రూ.65 కోట్లుగా ఉంది. మెర్సిడెస్-బెంజ్ G 63 AMG, ఆడి A6, లంబోర్గిని హురాకాన్ EVO, టయోటా ఎటియోస్, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ వంటి ల‌గ్జ‌రీ కార్లు అత‌డి గ్యారేజీలో ఉన్నాయి.