IPL 2025 : అశ్విన్, మొయిన్ అలీ, ఇంకా.. 2025 సీజన్ తరువాత ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యే ఆటగాళ్లు వీరే..!
కొద్ది మంది సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. కోట్లు పెట్టిన కొన్న ఆటగాళ్లు అంచనాలను అందుకోవడంలో విఫలం అవుతుండగా, అన్‌క్యాప్‌డ్ ఆటగాళు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా కొద్ది మంది సీనియర్ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్ తరువాత ముఖ్యంగా ముగ్గురు ఆటగాళ్లను మరోసారి ఐపీఎల్‌లో చూడడం కష్టమే.
రవిచంద్రన్ అశ్విన్..
అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ ను చెన్నై సూపర్ కింగ్స్ 9.75 కోట్లకు కొనుగోలు చేసింది. చెపాక్ మైదానంలో ఈ సీనియర్ ఆటగాడు ప్రత్యర్థులను తన స్పిన్‌తో ఉక్కిరి బిక్కిరి చేస్తాడని సీఎస్‌కే భావించింది. అయితే.. ఈ సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో అతడిని బెంచీకే పరిమితం చేశారు. ఈ సీజన్‌లో అతడు మరో మ్యాచ్ ఆడే అవకాశం కష్టమే. అదే సమయంలో వచ్చే సీజన్‌లో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా కనిపించడం లేదు.
అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 219 మ్యాచ్‌లు ఆడాడు. 185 వికెట్లు తీయడంతో పాటు 812 పరుగులు చేశాడు.
మొయిన్ అలీ..
ఈ స్టార్ ఆల్‌రౌండర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 కోట్ల బేస్ ప్రైజ్‌కే సొంతం చేసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు కేకేఆర్ 9 మ్యాచ్‌లు ఆడగా నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రమే అతడికి తుది జట్టులో స్థానంలో దక్కింది. దీంతో అతడు కేకేఆర్ ప్రణాళికలలో లేనట్లుగా అర్థమవుతోంది. 38 ఏళ్ల ఈ ఆటగాడిగాకి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఐపీఎల్‌లో ఈ స్టార్ ఆలౌరౌండర్ 71 మ్యాచ్‌లు ఆడాడు. 1167 పరుగులు చేయడంతో పాటు 38 వికెట్లు తీశాడు.
ఫాఫ్ డుప్లెసిస్..
ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్‌లో తన చివరి సీజన్ ఆడుతున్నాడు. ఎందుకంటే 41 ఏళ్ల ఈ ఆటగాడు ఐపీఎల్ 2025 వేలం తరువాత తాను మరో జట్టుకు వెళ్లనని ఇప్పటికే చెప్పేశాడు. ఈ సీజన్‌లో ఆరంభంలో గాయపడడంతో అతడు వరుసగా ఐదు మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో అతడు పెద్దగా ప్రభావాన్ని చూపలేదు. కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
MI VS LSG : ముంబై పై ఘోర ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్..
డుప్లెసిస్ ఇప్పటి వరకు 149 మ్యాచ్‌లు ఆడాడు. 4667 పరుగులు చేశాడు. ఇందులో 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.