SRH : ప్రాక్టీస్ వదిలివేసి మాల్దీవులకు చెక్కేసిన సన్‌రైజర్స్ టీమ్.. కావ్య పాప మాస్టర్ ప్లాన్ అదేనా?
ఐపీఎల్ మధ్యలో సన్‌రైజర్స్ ఆటగాళ్లు మాల్దీవులకు వెళ్లారు.

Sunrisers Hyderabad Players Flown To Maldives In Middle Of IPL 2025 Season
ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. టోర్నీ ప్రారంభానికి ముందు టైటిల్ ఫేవరేట్లలలో ఒకటిగా పరిగణించిన ఎస్ఆర్‌హెచ్ టీమ్.. ఇప్పుడు కనీసం ప్లేఆప్స్‌కు అర్హత సాధించేందుకు అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో 9 మ్యాచ్‌లో ఆడిన సన్‌రైజర్స్ మూడు మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. మరో 6 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆజట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉండగా నెట్‌రన్‌రేట్ -1.103గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
ఇలాంటి సమయంలో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ తీసుకున్న నిర్ణయం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సీజన్‌లో మధ్యలో ఉండగా ఇప్పుడు జట్టు ఆటగాళ్లు, సహాయసిబ్బందిని మాల్దీవులకు పంపింది. చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించిన వెంటనే టీమ్‌మొత్తాన్ని మాల్దీవులకు పంపించింది. ఆటగాళ్లు మాల్దీవుల్లో అడుగుపెట్టిన వీడియోను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
MI VS LSG : ముంబై పై ఘోర ఓటమి.. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ కు బీసీసీఐ బిగ్ షాక్..
Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3
— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2025 సీజన్‌లో తన తదుపరి మ్యాచ్‌ను గుజరాత్ టైటాన్స్‌తో ఆడనుంది. మే 2 శుక్రవారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఏప్రిల్ 30 లేదా మే 1న సన్‌రైజర్స్ మాల్దీవుల పర్యనను ముగించుకుని భారత్ కు వచ్చే అవకాశం ఉంది.
ఇంత సడెన్‌గా మాల్దీవుల పర్యటన ఎందుకు..?
కాగా.. ఇలా సీజన్ మధ్యలో సన్‌రైజర్స్ టీమ్‌ను మాల్దీవులకు పంపడం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు. ఈ పర్యటన ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు నూతన ఉత్తేజాన్ని తీసుకువస్తుందని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ భావించిందట. ఈ పర్యటన నుంచి వచ్చిన తరువాత కీలక మ్యాచ్‌లు ఆడనుండంతో.. ఈ మ్యాచ్‌ల్లో ఆటగాళ్లు నూతన ఉత్సాహంతో బరిలోకి దిగి మంచి ఫలితాలను సాధిస్తారని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. చూడాలి మరి ప్రాక్టీస్ వదిలివేసి మరి సన్‌రైజర్స్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుందో
MI vs LSG : నువ్వు కూడా సిక్స్ కొట్టావా.. పంత్ రియాక్షన్ వైరల్.. (వీడియో వైరల్)
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో 5 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధిస్తేనే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ జట్టు నెట్‌రన్‌రేట్ మైనస్‌లో ఉండడంతో ఈ ఐదు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిచి నెట్‌రన్‌రేట్‌ను సాధ్యమైనంత మేర మెరుగుపరచుకోవాల్సింది ఉంది.