కోహ్లీ టీంకి మరో షాక్ : పార్థివ్ పటేల్ తండ్రికి సీరియస్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2019 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్.

కోహ్లీ టీంకి మరో షాక్ : పార్థివ్ పటేల్ తండ్రికి సీరియస్

Updated On : April 10, 2019 / 11:41 AM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2019 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2019 ఆరంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేకపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మరో షాక్. క్లిష్ట పరిస్థితుల్లో అంతో ఇంతో స్కోరు చేసి జట్టు పరువు నిలుపుతున్న వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌కు మరో కష్టం వచ్చి పడింది. 

పార్థివ్ తండ్రి బ్రెయిన్ హోమరేజ్ కారణంగా బాధపడుతూ హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఇటువంటి భారమైన పరిస్థితుల్లో మనస్సును ఆటపై నిలపగలడాననే సందేహాలు నెలకొన్నాయి. ఓపెనర్‌గా దిగడమే కాక, వికెట్ల వెనుక కీపర్‌గానూ అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న పార్థివ్ పటేల్ జట్టు నుంచి దూరమైతే కోహ్లీకి మరో దారుణమైన కష్టం వచ్చిపడినట్లే. 
Read Also : KXIP మ్యాచ్ గెలిచారంటే సంబరాలే..

సీజన్ ఆరంభంలో పార్థివ్.. ‘మీ ప్రార్థనల్లో మా తండ్రి పేరు తలచుకోండి. అతను బ్రెయిన్ హోమరేజ్ వ్యాధితో బాధపడుతున్నాడు’ అని ట్వీట్ ద్వారా తెలిపాడు. ఇప్పుడు ప్రతి మ్యాచ్ అనంతరం డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్లి ఫోన్ లో ఏదైనా బ్యాడ్ న్యూస్ వచ్చిందేమోనన్న భయంతో చూసుకుంటూ ఉంటానని తెలిపాడు. 

‘ఆడుతున్నంత సేపు నా మైండ్‌లో ఆట మీదే ధ్యాస ఉంటుంది. ఒక్కసారి మ్యాచ్ పూర్తి అయితే మళ్లీ నా కుటుంబం గురించే ఆలోచిస్తూ ఉంటా. నేనిక్కడ ఉన్నా నా తల్లి, భార్య అక్కడి పరిస్థితులను చూసుకుంటూ ఉంటారు. రోజు మొదలయ్యేది.. పూర్తయ్యేది నా తండ్రి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూనే’ అని బాధతో పార్థివ్ తెలిపాడు.
Read Also : భజ్జీ.. తాహిర్‌లు వైన్ లాంటి వాళ్లు: ధోనీ