RCB vs DC
Ipl 2023, RCB vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడింది. తొలి మ్యాచ్‌లో ముంబై పై విజయం సాధించింది. ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో కేకేఆర్, లక్నో జట్ల చేతిలో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచులో విజయం సాధించి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. ఓపెనర్లు డుప్లెసిస్, విరాట్ కోహ్లీలు ఆ జట్టుకు బలం, బలహీనత. వీరు చెలరేగితే మ్యాచ్‌లు గెలుస్తుంది. వీరిద్దరు విఫలం అయితే మాత్రం ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. ఇలా ఇద్దరిపై ఆధారపడకుండా సమిష్టిగా రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. లేదంటే ఈ సారైనా కప్పు అందుకోవాలన్న ఆశ నెరవేరడం కష్టం కావచ్చు.
అటు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి అయితే మరీ దారుణం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచులు ఆడగా అన్నింటిల్లో ఓటమి పాలైంది. కనీసం బెంగళూరు పైనా అయినా విజయం సాధించి ఈ సీజన్‌లో గెలుపు బోణీ కొట్టాలని ఆరాడపడుతోంది. ఆ జట్టులో ఓపెనర్, కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ మాత్రమే రాణిస్తున్నారు. మిగిలిన వాళ్లు కూడా బాధ్యతను తీసుకోవాలి. లేదంటే మరో ఓటమి తప్పదు. లలిత్ యాదవ్, మిచెల్ మార్ష్, మనీష్ పాండే లు తమ స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ లో రాణిస్తేనే ఏ మాత్రం ఆశలు ఉంటాయి. ఏ మాత్రం అన్న ఆశలు ఉంటాయి. లేదంటే కష్టమే.