Rinku Singh : రింకూసింగ్ అరుదైన ఘ‌న‌త‌.. ఎలైట్ లిస్ట్‌లో చోటు

Rinku Singh In Elite List : రింకూసింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Rinku Singh : రింకూసింగ్ అరుదైన ఘ‌న‌త‌.. ఎలైట్ లిస్ట్‌లో చోటు

Rinku Singh

భార‌త క్రికెట్‌లో ప్ర‌స్తుతం రింకూ సింగ్ పేరు మారుమోగిపోతుంది. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న టీ20 సిరీస్‌లో త‌న అద్భుత‌మైన ఆట‌తీరుతో ఈ యువ ఆట‌గాడు అంద‌రిని ఆక‌ట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2023 సీజ‌న్‌లో కొన‌సాగించిన దూకుడు, ఫామ్‌ను ప్ర‌స్తుతం టీమ్ఇండియా త‌రుపున కంటిన్యూ చేస్తున్నాడు. ఆదివారం తిరువ‌నంత‌పురం వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొన్న రింకూ.. నాలుగు ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 31 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు.

భారత జ‌ట్టు భారీ స్కోరు చేయ‌డంలో త‌న వంతు సాయం చేశాడు. ఈ క్ర‌మంలో రింకూసింగ్ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా త‌రుపున‌ అత్య‌ధిక స్ట్రైక్‌రేటు న‌మోదు చేసిన నాలుగో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ మ్యాచ్‌లో రింకూ 344.44 స్ట్రైక్ రేట్‌ను క‌లిగి ఉన్నాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

Rishabh Pant : బ‌ల‌వంతం చేయొద్దు..రిష‌బ్ పంత్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ.. ఎవ‌రిని ఉద్దేశించి..?

2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో యువీ 362.50 స్ట్రైక్ రేటుతో 16 బంతుల్లో 58 ప‌రుగులు ప‌రుగులు చేశాడు. ఆ త‌రువాతి స్థానాల్లో దినేశ్ కార్తిక్ (362.50), హార్దిక్‌ పాండ్యా(355.55) లు ఉన్నారు. రింకూసింగ్ విశాఖ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచులోనూ 13 బంతుల్లో 22 ప‌రుగులు చేశాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు న‌ష్ట‌పోయి 235 ప‌రుగులు చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ (53), రుతురాజ్ గైక్వాడ్ (58), ఇషాన్ కిష‌న్ (52) లు హాఫ్ సెంచరీలు చేశారు. అనంత‌రం ల‌క్ష్య ఛేద‌న‌లో ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో తొమ్మిది వికెట్ల కోల్పోయి 191 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది. మార్క‌స్ స్టోయినిస్ (45), మాథ్యూవేడ్ (42 నాటౌట్‌), టిమ్ డేవిడ్ (37) లు ఓ మోస్త‌రుగా రాణించినా మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో 44 ప‌రుగుల తేడాతో ఓట‌మి త‌ప్ప‌లేదు. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో భార‌త్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.

RCB : దుర‌దృష్టం అంటే ఆర్‌సీబీదే..! ఆ జ‌ట్టు వ‌దిలేసిన ఆట‌గాళ్లు ఇతర ఫ్రాంచైజీల్లో మెరుగైన ప్రదర్శన