Rinku Singh : తుది జట్టులో లేకున్నా కూడా సూపర్ క్యాచ్ అందుకున్న రింకూ సింగ్.. ఎలాగో తెలుసా?
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో రింకూ సింగ్ (Rinku Singh) చక్కటి క్యాచ్ అందుకున్నాడు.

Rinku Singh was not in the playing eleven but took a catch do you know how
Rinku Singh : ఆసియాకప్ 2025 సూపర్-4లో భాగంగా శుక్రవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. స్కోర్లు సమమైన ఈ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. అయితే.. ఈ మ్యాచ్ తుది జట్టులో నయా ఫినిషర్ రింకూ సింగ్‌కు చోటు దక్కలేదు. అయినప్పటికి కూడా అతడు సూపర్ ఓవర్‌లో అద్భుతమైన క్యాచ్ అందుకుని భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
రింకూ సింగ్ ఫీల్డింగ్ ఎలా చేశాడంటే..?
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. టీమ్ఇండియా బ్యాటర్లలో అభిషేక్ శర్మ (31 బంతుల్లో 61 పరుగులు), తిలక్ వర్మ (34 బంతుల్లో 49 నాటౌట్) లు రాణించారు. లంక బౌలర్లలో తీక్షణ, చమీర, హసరంగ, శనక, అసలంక లు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం లంక లక్ష్య ఛేదనకు బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ను హార్దిక్ పాండ్యా వేశాడు. ఏడు పరుగులు ఇచ్చి ఓ వికెట్ సాధించాడు. ఈ ఓవర్ వేసిన అనంతరం కండరాలు పట్టేయడంతో హార్దిక్ మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో రింకూ సింగ్ సబ్‌సిట్యూట్ ఫీల్డర్‌గా బరిలోకి దిగాడు. మెయిన్ మ్యాచ్‌లో అతడికి క్యాచ్ అందుకునే ఛాన్స్ రాలేదు.
That. Was. One. Crazy. Game. Of. Cricket 🥵#SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvSL pic.twitter.com/XSrcmEBsy4
— Sony Sports Network (@SonySportsNetwk) September 26, 2025
పాతుమ్ నిస్సాంక (58 బంతుల్లో 107 పరుగులు) సెంచరీ చేయగా, కుశాల్ పెరీరా (32 బంతుల్లో 58) అర్థశతకంతో రాణించడంతో లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి సరిగ్గా 202 పరుగులే చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు తలా ఓ వికెట్ సాధించారు.
Asia cup 2025 : హరిస్ రవూఫ్, సూర్యకుమార్ యాదవ్‌లకు షాకిచ్చిన ఐసీసీ.. 30 శాతం జరిమానా.. ఇంకా..
స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసింది. సూపర్ ఓవర్‌లో తొలి బంతికి రింకూ సింగ్ చక్కని క్యాచ్ అందుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కుశాల్ పెరీరా ఇచ్చిన క్యాచ్‌ను చక్కగా ఒడిసి పట్టుకున్నాడు. దీంతో లంక ఒత్తిడిలో పడింది. మరో నాలుగు బంతులు ఆడి రెండు పరుగులు మాత్రమే చేసి ఇంకో వికెట్‌ను కోల్పోయింది. 3 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలి బంతికే సూర్య మూడు పరుగులు చేయడంతో విజయాన్ని అందుకుంది.