పంత్‌లో ధోనీని వెతకడం మానేయండి

పంత్‌లో ధోనీని వెతకడం మానేయండి

Updated On : March 12, 2019 / 9:40 AM IST

పంజాబ్‌లోని మొహాలీ వేదికగా జరిగిన నాల్గో వన్డేలో భారత్.. అనూహ్యంగా పరాజయానికి గురైంది. ఈ ఓటమికి పంత్‌యే కారణమంటూ సోషల్ మీడియాతో పాటు కొందరు సీనియర్లు సైతం పెదవి విరుస్తున్నారు. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆసీస్ ముందు 358 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. 
Read Also : బీజేపీ ఢిల్లీ అభ్యర్థిగా గౌతం గంభీర్?

దుర్భేద్యమైన ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్లు రెచ్చిపోయారు. 5 వికెట్లు కోల్పోయినా అద్భుతంగా రాణించి మ్యాచ్‌ను విజయంతో ముగించారు. ఈ వైఫల్యానికి టీమిండియా చేసిన 5తప్పులు కారణమని చెప్పిన కోహ్లీ.. స్టంపౌట్ లు కూడా మిస్ చేసుకున్నామని వ్యాఖ్యానించాడు. దీంతో పంత్ ప్రదర్శనను పరోక్షంగా వేలెత్తి చూపినట్లు అయింది.

చాహల్ బౌలింగ్ వేస్తున్న 39వ ఓవర్లో పీటర్ హ్యాండ్స్‌కాంబ్ బ్యాటింగ్ చేస్తుండగా టర్నర్‌ను స్టంపౌట్ ఛేయడం పంత్ మిస్ చేశాడు. దీంతో ఆ స్థానంలో ధోనీ ఉంటే వేరేలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఢిల్లీ కోచ్ సిన్హా స్పందించారు. మహేంద్ర సింగ్ ధోనీ కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి స్టంపౌట్ లు మిస్ చేశాడని గుర్తు చేశారు. పంత్ లో ధోనీనీ వెతకడం మానేయడండి. అతనిలా ఆడనివ్వండి అంటూ పిలుపునిచ్చారు.